• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచ బాలల దినోత్సవం వేళ -నీలి రంగులోకి జాతీయ కట్టడాలు -వెంకయ్య కీలక ప్రసంగం

|

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం(నవంబర్ 20) సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, రాయిసీనా రోడ్డులోని కేంద్ర సచివాలయ భవనాలు, పార్లమెంట్ భవంతి, కుతుబ్ మినార్ సహా దేశంలోని ఇతర చారిత్రక, స్మారక కట్టడాలన్నీ నీలి రంగు వెలుతురులో మిలమిలా మెరిశాయి. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా బాలల కోసం పనిచేసే యునిసెఫ్ ఈ ఏడాది ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా 'గో బ్లూ 20' పేరుతో క్యాంపెయిన్ చేపట్టగా.. అందులో భాగంగా పిల్లల హక్కుల కోసం సంఘీభావంగా నిలిచేందుకు, కొవిడ్‌ 19 ప్రభావం, జీవితాలపై వాతావరణ మార్పులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలు నీలమయం అయ్యాయి.

  Climate Change is Real challenge, Urgent Action Needed ప్రశ్నార్థకంగా మానవాళి ఉనికి...!!

  కొవిడ్-19 వ్యాక్సిన్: మరో 10 రోజుల్లో -'ఎమ‌ర్జెన్సీ యూజ్' కోసం ఫైజర్ అభ్యర్థన -ఎఫ్‌డీఏ ఓకే చెప్పేనా?కొవిడ్-19 వ్యాక్సిన్: మరో 10 రోజుల్లో -'ఎమ‌ర్జెన్సీ యూజ్' కోసం ఫైజర్ అభ్యర్థన -ఎఫ్‌డీఏ ఓకే చెప్పేనా?

  బాలల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కార్యకలాపాలు వర్చువల్‌, డిజిటల్‌ పద్ధతుల్లో జరుగుతాయని యునిసెఫ్ ఇదివరకే తెలిపింది. పార్లమెంటేరియన్‌ గ్రూప్‌ ఫర్‌ చిల్డ్రన్‌ (పీజీసీ) భాగస్వామ్యంతో యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 30 మంది ఎంపీలు.. చిన్నారులు, బాలల హక్కుల బాధ్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య కీలక ప్రసంగం చేశారు.

   indias monuments illuminated with blue lights on World Childrens Day, venkaiah key speech

  ''ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఒక్కసారి బాల్యాన్ని గుర్తుతెచ్చుకుంటే.. నా మనవరాళ్ల కంటే నేను ఎంతో అదృష్టవంతుడినని అనిపిస్తుంది. చిన్నప్పుడు మా చేతుల్లో ఎలాంటి గాడ్జెట్లు ఉండేవి కావు. శుభ్రమైన చక్కటి వాతావరణంలో పెరిగాం. ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు కాలుష్యం కూడా పెరిగింది. కోట్లాది టన్నుల గ్రీన్ హౌజ్ వాయువులను నిరంతరం పంపిండ్ చేస్తుండటంతో పర్యావరణం పాడైపోయింది. భూమి సహా మానవాళి ఉనిని క్లైమెట్ ఛేంజ్ ప్రశ్నార్థకంగా మార్చాయి. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం క్లైమెట్ ఛేంజ్ ప్రభావాన్ని తగ్గించడానికి మనకు 10 నుంచి 12 ఏళ్ల సమయమే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే, భవిష్యత్తులో రాబోయే గ్రహణం నుంచి మన తరాలను కాపాడటానికి మనకున్న సమయం అతి తక్కువ'' అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

  బీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్‌లాగే తిరుపతిలోనూబీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్‌లాగే తిరుపతిలోనూ

   indias monuments illuminated with blue lights on World Childrens Day, venkaiah key speech

  ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా యునిసెఫ్ ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలోనే.. వాతావరణ మార్పుల ప్రభావంపై కొందరు పిల్లలు.. ఎంపీలతో చర్చలు జరిపారు. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలపై పలు చార్ట్‌ ఆఫ్‌ డిమాండ్లను సమర్పించారు. అందరం కలిసికట్టుగా వాతావరణాన్ని కాపాడుకుందామనే నిబద్ధత లేఖపై ఎంపీలు సంతకాలు చేశారు.

   indias monuments illuminated with blue lights on World Childrens Day, venkaiah key speech

   indias monuments illuminated with blue lights on World Childrens Day, venkaiah key speech
  English summary
  amid World Children's Day 2020, The Rashtrapati Bhavan, North Block, South Block, Qutub Minar and other monuments across India illuminated with blue lights on friday. Vice President venkaiah naidu greetings to all on World Children’s Day. in solidarity with child rights and the impact of COVID-19 on children's lives, the UNICEF calls for GoBlue campaign.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X