వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో తగ్గిన జనాభా పెరుగుదల

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అయితే జనాభాను తగ్గించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఫలితం దక్కింది. భారత్‌లో తొలిసారిగా జనాభా పెరుగుదల రేటు తగ్గింది.

ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకనిఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకని

ఐక్యరాజ్య సమితి నివేదిక

ఐక్యరాజ్య సమితి నివేదిక

ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏటా అధ్యయనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పాపులేషన్ ఫండ్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2019 పేరుతో ఓ నివేదిక తీసుకొచ్చింది. అందులో భారత్‌లో జనాభా పెరుగుదల రేటు 0.4శాతం తగ్గినట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో 137కోట్ల జనాభా ఉండగా.. 2001-11 మధ్యకాలంలో పాపులేషన్ గ్రోత్ రేట్ 1.64శాతంగా నమోదైంది. అయితే 2010-19కి వచ్చేసరికి ఆ పర్సెంటేజీ 0.4శాతం మేర తగ్గింది.

కుటుంబ నియంత్రణ పద్దతులు

కుటుంబ నియంత్రణ పద్దతులు

జనాభా పెరుగుదల తగ్గడానికి మహిళల్లో వచ్చిన చైతన్యమే కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులు పాటిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే బాల్య వివాహాలు మాత్రం ఏటా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

18ఏళ్లు దాటిన తర్వాతే తల్లులు

18ఏళ్లు దాటిన తర్వాతే తల్లులు

గతంలో 18ఏళ్లలోపు తల్లులు అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే ఈ దశాబ్దంలో ఆ సంఖ్య సగానికి తగ్గిందని యూఎన్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇకపై భారత్‌లో జనాభా పెరుగుదల సమస్య కాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యావంతులు, సామాజిక అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.

సగటు టీఎఫ్ఆర్ 2.2

సగటు టీఎఫ్ఆర్ 2.2

దశాబ్దకాలంలో భారత్‌లో జననాల రేటు చాలా వరకు తగ్గిందని యూఎన్ రిపోర్టు చెబుతోంది.1991లో వెయ్యికి 30 మంది తగ్గగా ప్రస్తుతం అది 20కి చేరింది. సంతాన సాఫల్య రేటు.. టీఎఫ్ఆర్ కూడా సగానికి తగ్గింది. 1970లో 5గా ఉన్న టీఎఫ్ఆర్ ప్రస్తుతం 2.2కు పరిమితమైంది. సగటు టీఎఫ్ఆర్ రేటు 2.1 కాగా.. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతాన సాఫల్యత రేటు 1.8గా ఉండటం విశేషం. జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరుగుతుండటం ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉత్తర, దక్షిణ భారత్‌లో అంతరం

ఉత్తర, దక్షిణ భారత్‌లో అంతరం

దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఆ రాష్ట్రాల్లో పాపులేషన్ ఏ మాత్రం తగ్గడంలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా పెరుగుదల స్థిరంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోంది. ఉత్తరాదిలో ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో జనాభా పెరుగుదల రేటు కలవరపెడుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో టోటర్ ఫెర్టిలిటీ రేట్.. టీఎఫ్ఆర్ 3కు పైగాఉంది. నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ విషయంలో మహిళలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

English summary
There’s heartening news on an age-old Indian problem. A report released by the United Nations Population Fund earlier this month indicates that India’s population growth rate has slowed substantially in the 2010-2019 period. According to the report, India’s population may have grown at .4 percentage points lower in the 2010-2019 period as compared to the decade between 2001 and 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X