వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

73 శాతం సంపద ఒక్క శాతం మంది వద్దే: ఓ కూలీ అంత సంపాదించాలంటే 941 ఏళ్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

73 శాతం సంపద ఒక్క శాతం మంది వద్దే..!

న్యూఢిల్లీ: భారత దేశంలో 73 శాతం సంపద గత ఏడాది కేవలం 1 శాతం మంది చేతిలోకి వెళ్లిందని ఓసర్వేలో వెల్లడైంది. ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆదాయ అసమానలతలు ఆందోళన కలిగించే విషయం. ఇంటర్నేషనల్ రైట్స్ గ్రూప్ ఆక్స్‌పామ్ సర్వే ఈ విషయం వెల్లడించింది.

ఈ ఆర్థిక అసమానత ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోందని ఈ సర్వే పేర్కొంది. గత ఏడాది 82 శాతం సంపద ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక శాతం మంది చేతుల్లోకి వెళ్లింది. 3.7 బిలియన్ ప్రజల సంపదలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం యానువల్ మీటింగ్‌ను ఆక్స్‌ఫాం సర్వే గమనిస్తోంది. ఇక్కడికి వచ్చే ప్రపంచ ప్రముకులు, నేతలు ప్రధానంగా ఆదాయం, జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతారు.

గత ఏడాది సర్వే ప్రకారం

గత ఏడాది సర్వే ప్రకారం

గత ఏడాది సర్వే ప్రకారం భారత దేశంలో 58 శాతం సంపద కేవలం 1 శాతం మంది చేతిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 50 శాతంగా ఉంది. ఈ లెక్కన భారత దేశంలోనే అసమానత ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే, ఏడాది లెక్కన తీసుకుంటే, గత ఏడాది అంటే 2017లో మాత్రం పెద్ద మొత్తంలో సంపదన ఒక శాతం మంది చేతిలోకి వెళ్లింది. 2017లో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. అలాగే, 2010 నుంచి తీసుకుంటే సరాసరి 13 శాతం ఎక్కువ ఆదాయం బిలియనీర్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రతి ఏటా ఇది కేవలం రెండు శాతంగా ఉంటుంది.

ఈ కంపెనీ హెడ్ జీతం కూలీకి రావాలంటే 941 ఏళ్లు

ఈ కంపెనీ హెడ్ జీతం కూలీకి రావాలంటే 941 ఏళ్లు

మన దేశంలో, ఇండియన్ గార్మెంట్స్ కంపెనీని లీడ్ చేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఏడాది ఆదాయాన్ని తీసుకుంటే.. ఓ డెయిలీ మినిమమ్ వేజ్ వర్కర్ అంత మొత్తం సంపాదించాలంటే 941 ఏళ్లు పడుతుంది. అమెరికా విషయానికి వస్తే ఓ సీఈవో ఒక రోజులో పొందే వేతనం అమెరికాలోని ఓ సామాన్యుడు ఏడాదిలో సంపాదిస్తాడు.

ఈ సర్వేను పది దేశాల్లో 70,000 మందితో చేశారు. ఇందులో ప్రతి మూడింట రెండొంతుల మంది ఓ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలపై వెంటనే చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

 మోడీకి సూచన

మోడీకి సూచన

ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫాం ఓ విజ్ఞప్తి చేసింది. భారత ప్రభుత్వం అందరి ప్రగతి కోసమని, కేవలం కొందరి కోసం కాదని తెలియజెప్పాలన్నారు.

లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్‌లను ప్రోత్సహిస్తే మరిన్ని ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని ఈ సర్వే అభిప్రాయపడింది. వ్యవసాయంలో పెట్టుబడి, అలాగే, ఇప్పుడున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అభిప్రాయపడింది.

 60 శాతం పే కట్ ఉండాలని

60 శాతం పే కట్ ఉండాలని

అమెరికా, యూకేలతో పాటు భారత్‌లో చేసిన ఈ సర్వేలో.. సీఈవోలకు 60 శాతం పే కట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. భారత్‌లో గత ఏడాది 17 మంది కొత్త బిలియనీర్లు చేరారు. దీంతో మొత్తం వీరి సంఖ్య 101కి చేరుకుంది.

బిలియనీర్ల ఆస్తి 20.7 లక్షల కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇది 4.89 లక్షల కోట్లుగా ఉంది. భారత్‌లో 37 శాతం కుటుంబ వారసత్వంగా ఉంది. అక్స్‌ఫామ్ సీఈవో నిషా మాట్లాడుతూ.. కొద్ది మంది చేతుల్లోనే ఆర్థిక ప్రయోజనాలు ఉండటం ఆందోళనకరమని చెప్పారు.

బిలియనీర్లు పెరుగుతున్నా

బిలియనీర్లు పెరుగుతున్నా

బిలియనీర్ల సంఖ్య పెరగడం పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా చూడలేమని అన్నారు. ప్రతి ఒక్కరు రెండు పూటలా భోజనం చేయడం మొదలు పిల్లలు చదువులు ఇబ్బంది లేకుండా కొనసాగడం వరకు ఉండాలన్నారు. ఆర్థిక అసమానతలతో బిలియనీర్ల సంఖ్య పెరిగి లాభం లేదని అభిప్రాయపడ్డారు.

మరో విషయం ఏమంటే, బిలియనీర్లలో మహిళలు కూడా ఎక్కువగా లేరు. ప్రతి పదిమందిలో 9 మంది బిలియనీర్లు పురుషులే. భారత్‌లో నలుగురు మహిళలు బిలియనీర్లు. మరో ముగ్గురు కుటుంబ వారసత్వ ఆస్తి కలిగి ఉన్నారు.

English summary
The richest 1 per cent in India cornered 73 per cent of the wealth generated in the country last year, a new survey showed on Monday, presenting a worrying picture of rising income inequality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X