వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికే ఫార్మసీగా భారత్ - ఐరాస అసెంబ్లీలో మోదీ ప్రసంగం - ఉగ్రవాదం నిర్మూలనకు పిలుపు

|
Google Oneindia TeluguNews

కరోనా విలయ సమయంలో ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాలని, అందుకోసం ఐక్యరాజ్యసమితి నిర్ధిష్టమైన విధానాలు రూపొందిచాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీదారుగా ఉన్న భారత్.. కరోనా వేళ మిగతా దేశాలకు సహాయకారిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనాపై పోరులో భారత్ తనవంతు పాత్రను పోషిస్తున్నదని, పెద్ద ఎత్తున మందులు తయారు చేస్తూ 'ప్రపంచానికే ఫార్మసీ'లాగా వ్యవహరిస్తున్నదని గుర్తుచేశారు.

ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ - నిర్ణయాత్మక స్థానం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఆగాలి?ఐరాసపై నిప్పులు చెరిగిన మోదీ - నిర్ణయాత్మక స్థానం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఆగాలి?

ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 75వ సెషన్ లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రసంగించారు. మొత్తం 21 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో.. ఉగ్రవాద నిర్మూలన, కరోనా పరిస్థితుల్లో దేశాల మధ్య సహకారం, భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం, ప్రపంచ శాంతి తదితదితర అంశాలను హైలైట్ చేశారు.

Indias Role as Pharmacy to World: PM Modis address to the UN General Assembly

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి సమావేశాలను వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఇచ్చిన వీడియోత సందేశాన్ని న్యూయార్క్ లోని యూఎన్ జనరల్ అసెంబ్లీ హాలులో శనివారం ప్రసారం చేశారు. ''మానవాళి భవిష్యత్తు, ఐక్యరాజ్యసమితో చోటుచేసుకోవాల్సిన మార్పులు, బహుపాక్షిక నిబద్ధత, కొవిడ్-19 మహమ్మారిపై సామూహిక పోరు'' అనే థీమ్ తో ఈ ఏడాది ఐరాస జనరల్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

కొవిడ్ కష్టకాంలో భారత్ లోని ఫార్మా పరిశ్రమ నుంచి 150కిపైగా దేశాలకు అత్యవసర మందులు సరఫరా అయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దేశీయంగా సరికొత్త విధానాలతో ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నామని, విపత్తు ద్వారా తలెత్తిన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా 'ఆత్మనిర్భర్ భారత్' నినాదంతో ముందుకు వెళుతున్నామని, తద్వారా స్వావలంబన సాధించడంతోపాటు గ్లోబల్ ఎకానమీలోనూ శక్తి గుణకంగా భారత్ ఉంటుందన్నారు. భారత్ లో అన్ని పథకాల ప్రయోజనాలు, ఎటువంటి వివక్ష లేకుండా, ప్రతి పౌరుడికి అందుతున్నాయని ఐరాసకు వివరించారు.

బీజేపీలో అనూహ్య మార్పులు - టీమ్ నడ్డాలో పురందేశ్వరి, డీకే అరుణ - రాంమాధవ్, మురళీధర్ తొలగింపు బీజేపీలో అనూహ్య మార్పులు - టీమ్ నడ్డాలో పురందేశ్వరి, డీకే అరుణ - రాంమాధవ్, మురళీధర్ తొలగింపు

కాగా, భారత ప్రధాని తన ప్రసంగంలో ఐరాసలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని బలంగా వాదించారు. మిగతా దేశాలకంటే గొప్పగా భారత్ ఐరాసను గౌరవించిందని, ఇకనైనా భారత్ పట్ల చిన్నచూపు వహించడం మానుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి భారత్ ఎల్లప్పుడూ పాటుపడుతున్నదని, అయితే, ప్రపంచ దేశాలకు ముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాద సంస్థలను గుర్తించే, ఆ మేరకు జాబితాను రూపొందించే ప్రక్రియ విషయంలో ఐక్యరాజ్యసమితి మరింత పారదర్శకంగా వ్యవహరించాలని మోదీ అన్నారు.

English summary
Prime Minister Narendra Modi address the United Nations General Assembly (UNGA) in the 75th session on Saturday. In the backdrop of the Covid-19 pandemic, the UNGA is being conducted virtually this year, PM Modi says, India's Role as 'Pharmacy to World' in video message, which played played out in New York's UN head office. The theme of the 75th UNGA is “ The future we want, the United Nations we need, reaffirming our collective commitment to multilateralism – confronting the COVID-19 through effective multilateral action”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X