వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ

|
Google Oneindia TeluguNews

భూగోళం మొత్తాన్ని కరోనా విలయం చుట్టుముట్టగా.. ఆ సంక్షోభ సమయంలో ప్రపంచం బాధ్యతను భారత్ తలకెత్తుకుందని, 150కిపైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తూ మొత్తం మానవాళికే రక్షణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతేకాదు, నాలుగవ పారిశ్రామిక విప్లవం భారత్ లోనే పుట్టుకొస్తుందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరంచంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) దావోస్ సదస్సును ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రసంగించారు. నాలుగో పారిశ్రామిక విప్లవంపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ.. ప్రపంచవ్యాప్తంగా 400 మందికిపైగా అగ్రశ్రేణి పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలు కంపెనీల సీఈఓలతో ప్రధాని సంభాషించారు. కరోనా విలయానికి విరుగుడుగా వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించడం ద్వారా భారత్ మనవాళిని కాపాడే బాధ్యతను నెరవేర్చిందని మోదీ పేర్కొన్నారు.

 Indias success will help the entire world says PM Modi at WEFs Davos Dialogue

''కరోనా వైరత్ వల్ల భారత్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని, కనీసం 20 లక్షల మంది చనిపోతారని గతంలో అంచనాలు వెలువడ్డాయి. కానీ వాటిని తలకిందులు చేస్తూ, భారతీయులందరం సమిష్టిగా కరోనాపై పోరాటం చేశాం. ఇవాళ 130 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రపంచానికి ఆశ, విశ్వాసాలను కలిగించడానికే నేనీ సదస్సుకు వచ్చాను. వైరస్ బారి నుంచి భారతీయులను కాపాడుకున్నట్లుగానే.. 150కిపైగా దేశాలకు మందుల్ని, వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను, మౌలిక సదుపాయాలను అందిస్తూ యావత్ మానవాళినీ కాపాడగలుగుతున్నాం'' అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక,

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలువ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ వేదికగా నిలుస్తుందని, ఇందుకోసం భారత్ నాలుగు పిల్లర్లతో పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందిస్తున్నదని మోదీ తెలిపారు. పారిశ్రామిక విప్లవానికి.. కనెక్టివిటీ, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ డేటాలను నాలుగు పిల్లర్లుగా భావిస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా విస్తృతమైన అవకాశాలు లభిస్తాయని, భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ కంపెనీలను మోదీ అభ్యర్థించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday lauds India's efforts to fight the viral coronavirus disease outbreak and said that the country never gave up and kept moving ahead with pro-active approach and public participation. The pm addressed the World Economic Forum's Davos Dialogue via video conference
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X