వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్త ఊరట: డిసెంబర్‌ నెలకు గాను దేశంలో నిరుద్యోగత శాతం 7.7గా నమోదు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో నిరుద్యోగత అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నిరుద్యోగత రేట్ దారుణంగా పడిపోయింది. గత నెల డిసెంబర్‌కు ఇది 7.7 శాతానికి పడిపోయింది. అదే నవంబర్ నెలకు నిరుద్యోగత రేటు 7.48శాతంగా ఉన్నింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. గత మూడేళ్లతో పోలిస్తే నవంబర్‌ నెలలో నిరుద్యోగత రేటు 1శాతం పడిపోయి 7.48 శాతంకు చేరింది.

ఇక నిరుద్యోగ రేటు పడిపోవడానికి ప్రధాన కారణం ఆటో ఇండస్ట్రీ అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్ననాలుగేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగించాల్సి ఉంటుందని ప్రపంచపు అతిపెద్ద ఆటో పార్ట్స్ సప్లయర్ బోష్ లిమిటెడ్ ప్రకటించింది. 3,700 మంది ఉద్యోగస్తులను తొలగించాల్సి ఉంటుందని బోష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు.

Indias unemployment rate increased to 7.7 per cent in December

మరోవైపు పట్టణప్రాంతాల్లో నిరుద్యోగ రేటు కూడా దారుణంగా పడిపోయింది. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు పరిశీలిస్తే దేశంలో నిరుద్యోగత రేటు 9.3శాతానికి పడిపోయింది. నాలుగు త్రైమాసికాలకు గాను ఇంత దారుణంగా పడిపోవడం అదే తొలిసారి. అయితే ఇది అధికారిక నివేదిక కాదు. కేంద్రంలోని గణాంకాల శాఖ వద్ద నమోదైన సంఖ్య వేరుగా ఉంది. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు మూడింట ఒకవంతు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఉద్యోగాలు కల్పించడం లేదా ఉద్యోగ ప్రకటనలు కేంద్రం విడుదల చేయకపోవడంపై ఇటు ప్రతిపక్షాలు ఇటు నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన అనధికారిక గణాంకాల ప్రకారం జూలై 2017 నుంచి జూన్ 2018 వరకు దేశంలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగత ప్రస్తుతం నెలకొని ఉందన్న విషయం లీక్ అయ్యింది. అయితే మోడీ సర్కార్ అధికారికంగా గతేడాది మే నెలలో ఈ నివేదికను విడుదల చేసింది.

English summary
India's unemployment rate increased to 7.7 per cent in December, slightly higher than 7.48 per cent reported in the previous month, according to data released by think-tank Centre for Monitoring Indian Economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X