వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్విస్ సహకారం కోరిన భారత్: బ్లాక్‌మనీ వెల్లడి తక్కువే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్లాక్ మనీ విషయంలో స్విట్జర్లాండ్ సహకారాన్ని భారత్ కోరింది. స్విస్ బ్యాంకుల్లో పలువురు భారతీయులు నల్ల ధనం దాచుకున్నారు. ఈ విషయంలో సహకరించాలని ప్రభుత్వం వారిని కోరుతోంది. స్విస్‌లో నల్లధనం ఉన్న వారి వివరాల విషయంలో సహకారం కావాలని అడిగింది.

హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జస్టిస్ అండ్ పోలీస్ ఆఫ్ స్విస్ కాన్ఫెడరేషన్ మంత్రి సిమోనెట్టా సోమ్మారుగను కలిశారు. నల్లధనం వివరాల విషయంలో సహకారం కావాలని కోరారు.

India seeks enhanced Swiss cooperation to tackle black money menace

కాగా, నల్లధనానికి స్వర్గధామంగా భావించే మనదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదాయ వెల్లడి పధకానికి (ఐడీఎస్‌ 2016)కు స్పందనగా రూ. 65,250 కోట్ల నల్లధనం, ఆస్తులు వెలుగు చూశాయి.

మనకంటే ఆర్ధికంగా, జనాభా పరంగా ఎంతో చిన్నదైన ఇండోనేషియాలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పధకంలో దాదాపు రూ.18.55 లక్షల కోట్ల నల్లధనం వెలుగు చూసింది. అర్జెంటీనాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన నల్లధనం వెల్లడి పథకం కింద దాదాపు దాదాపు రూ.5.36 లక్షల కోట్లు అక్రమ ఆస్తులను వెలుగులోకి వస్తాయని అంచనా. వీటితో పోల్చితే మనదేశంలో వెల్లడైన అక్రమ సంపాదన ఎంతో తక్కువ.

English summary
India on Thursday sought enhanced cooperation from Switzerland in tackling menace of black money by providing information on people stashing illegal funds in that country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X