వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ సడలింపులతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్నా, కరోనా విలయం మాత్రం యధావిధిగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,871 కేసులు, 1033 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు(74,94,552) పెరిగింది.

హైదరాబాద్‌ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడహైదరాబాద్‌ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడ

10 కోట్లకు చేరువగా టెస్టులు...

10 కోట్లకు చేరువగా టెస్టులు...

గత 24 గంటల్లో చనిపోయిన 1033 మందితో కలిపి దేశంలో కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 1,14,031కు చేరింది. కాగా, రికవరీ రేటులో ప్రపంచంలోనే మెరుగ్గా ఉన్న భారత్ లో కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుంటోన్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలోని వివిధ ఆస్పత్రుల నుంచి 72,615 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 66 లక్షలకు(65,97,210కు) చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 7,83,311గా ఉంది. ఇక కరోనా టెస్టుల్లో భారత్ మరో మైలురాయికి చేరువైంది. నిన్న ఒక్కరోజే 9,70,173 శాంపిళ్లను పరీక్షించడంతో ఇప్పటి వరకు దేశంలో 9కోట్ల42 లక్షల24 వేల190 కరోనా టెస్టులు చేసినట్లయిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

గ్లోబల్ గా 4 కోట్లు దాటాయి..

గ్లోబల్ గా 4 కోట్లు దాటాయి..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆదివారం నాటికి 4 కోట్లు దాటింది. అమెరికాలో కేసుల సంఖ్య 83.42లక్షలుగా ఉండగా, 75లక్షల కేసులతో భారత్ రెండో స్థానంలో ఉంది. యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దీంతో కొన్నిదేశాలు మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్ రాజధాని లండన్‌ లో జనం ఇళ్లు వదిలి బయటికి రావడంలేదు. ప్యారిస్ సహా 8 నగరాల్లో ప్రజలు అత్యవసర పనుల నిమిత్తం కేవలం కొద్ది గంటలు మాత్రమే బయటికి వస్తున్నారు. స్పెయిన్‌లో కొత్తగా 6,593 కేసులు, ఇటలీలో కొత్తగా రికార్డు స్థాయిలో 10,010 కేసులు, బెల్జియంలోనూ కొత్తగా 10వేల పైచిలుకు కేసులు వచ్చాయి. బెల్జియంలో రాబోయే నాలుగువారాల పాటు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు.

అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?

Recommended Video

Coronavirus Survive For 28 Days On Smartphones, Currency ఈ వస్తువులపై 28 రోజుల పాటు జీవించే కరోనా!!
టీకా పంపిణీకి 90 కోట్ల సిరంజిలు

టీకా పంపిణీకి 90 కోట్ల సిరంజిలు

కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరిన తరుణంలో, వాటి పంపిణీపై భారత్ ముందస్తుగా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రజలకు టీకాలను అందించడం కోసం సిరంజి తయారీ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది. కొవిడ్‌ టీకా పంపిణీకి 0.5 ఎంఎల్‌ ఏడీ (ఆటో డిసబుల్‌) సిరంజిలు వాడుతున్నారు. తొలి విడతలో భారత్ కు 90 కోట్ల సిరంజిలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్ లో సిరంజి తయారీదార్లలో అగ్రగాములుగా ఇండియన్‌ ఫర్మ్స్‌, హిందుస్థాన్‌ సిరంజెస్‌, ఇస్కాన్‌ అండ్‌ బెక్టాన్‌ డైకిన్‌సన్‌ అనే మూడు కంపెనీలు కొనసాగుతున్నాయి. ఎగుమతులను కొనసాగిస్తూనే దేశీ అవసరాలకు తగినట్లు సిరంజిల ఉత్పత్తి పెంచుకునేలా ఆయా కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

English summary
India has exponentially scaled up its testing capacity from one in January to more than 9.32 crore at present, the ministry of health and family welfare said today. according to union health ministry latet data released on sunday, India reports 61,871 new COVID19 cases an 1033 deaths in last 24 hours. tally reached near 75 lack, total deaths to 1,14,031. about 65,97,210 discharged and active cases are 74,94,552.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X