వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా డేంజర్ బెల్స్ : స్పెయిన్,ఇటలీలను దాటి ఐదో స్థానంలో భారత్..

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో ఐదు,ఆరు స్థానాల్లో ఉన్న స్పెయిన్,ఇటలీలను సైతం దాటేసి తాజాగా భారత్‌ ఐదో స్థానానికి చేరుకుంది. ఆదివారం(జూన్ 7) ఒక్కరోజే 9887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో భారత్‌లో కేసుల సంఖ్య 2,54,354కి చేరింది. స్పెయిన్‌లో ప్రస్తుతం 241,550 పాజిటివ్ కేసులు ఉండగా.. ఇటలీలో 2,34,801 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకూ 294 మంది మృతి..

ఇప్పటివరకూ 294 మంది మృతి..

భారత్‌లో ఆదివారం ఒక్కరోజే 294 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. మృతుల్లో 70శాతానికి పైగా ఇతర వ్యాధులతో బాధుపడుతున్నవారే ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కరోనా రికవరీ రేటు కూడా బాగానే ఉందని.. ఇప్పటివరకూ 48.20శాతం మంది కరోనా రోగులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొంది.

చైనాను దాటేసిన మహారాష్ట్ర

చైనాను దాటేసిన మహారాష్ట్ర

కేసుల సంఖ్యలో దేశంలోనే టాప్‌లో ఉన్న మహారాష్ట్ర తాజాగా చైనాను కూడా దాటేసింది. ఆదివారం నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85,975కు చేరింది. అటు చైనాలో కరోనా కేసుల సంఖ్య 83.036గా ఉంది. ఇప్పటివరకూ కరోనాతో దేశవ్యాప్తంగా 6929 మంది మృత్యువాత పడగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3వేల మంది మృత్యువాతపడ్డారు.

Recommended Video

Hyderabad Journalist Passed Away In Gandhi Hospital Due To Covid 19
అన్‌లాక్ దశలో విజృంభిస్తున్న కరోనా..

అన్‌లాక్ దశలో విజృంభిస్తున్న కరోనా..

భారత్‌లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ.. అన్‌లాక్ చేసే క్రమంలో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటప్పుడు కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం మూడు వారాల సమయమే పట్టే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్‌ ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటిక్‌ డైరెక్టర్‌ మైకేల్‌ రయాన్‌ అంచనా వేశారు. నగరాల్లో అత్యధిక జనసాంద్రత,భారీ వలసలు,పనిచేస్తే తప్ప తిండి దొరకని పరిస్థితులు వైరస్ నియంత్రణలో సవాళ్లుగా మారుతాయని అభిప్రాయపడ్డారు.

English summary
India has reported yet another highest single-day spike of 9,971 new COVID-19 cases, including 287 deaths in the past 24 hours, which takes the total number of coronavirus cases to 2,46,628.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X