వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇబ్బందులు: మాల్దీవులకు విమానాల్లో మంచినీరు పంపిన భారత్(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

కొలంబో/న్యూఢిల్లీ: మాల్దీవులలో మంచి నీటిని సరఫరా చేసే కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో.. దేశ రాజధాని మాలేలో సుమారు లక్ష మంది ప్రజలు తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనడానికి తమకు సాయం చేయాల్సిందిగా భారత్, శ్రీలంక, చైనా, అమెరికాలను మాల్దీవుల ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలో సత్వరం స్పందించిన భారత ప్రభుత్వం ఐఎల్-76 అనే ప్రత్యేక విమానంలో మాలెకు నీటిని పంపించిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐదు విమానాల్లో నీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నీటిని విమానాల్లో పంపుతున్న ఫొటోలను కూడా ఆయన అప్‌లోడ్ చేశారు.

హిందూ మహాసముద్రంలోని చిన్న దీవుల సముదాయంగా ఉన్న మాల్దీవులలో సముద్రపు నీటినే శుద్ధి చేసుకుని వాడుకుంటున్నారు. మాలేలో ప్రభుత్వమే ఉచితంగా ప్రతీ ఇంటికి నీటిని సరఫరా చేస్తుంది.

కాగా, నీటి శుద్ధి కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంతో అందులోని అన్ని పరకరాలు పనికి రాకుండా పోయాయి. వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉండటంతో మరికొన్ని రోజులపాటు మాలే ప్రజలకు నీటి కష్టాలు తప్పవని ఆ దేశ మంత్రి షరీఫ్ చెప్పారు. తమకు తాగునీటిని అందించాలని వారు ఇరుగుపొరుగుదేశాలకు విజ్ఞప్తి చేశారు.

India Sending Water in 5 Large Planes Today to Maldives
English summary
Water was cut off to more than 100,000 residents in the Maldives' capital because of a fire in the city's water treatment plant, a minister said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X