వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. 9 గంటల్లో 2 కోట్లకు పైగా డోసుల పంపిణీ, మోడీకి ఇదే నిజమైన గిప్ట్..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను వ్యాక్సిన్‌తో నివారణ సాధ్యం.. అందుకే ఫస్ట్, సెకండ్ డోసుతోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని చెబుతున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. జనం కూడా టీకా వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం.. అందుకే రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. 9 గంటల్లో 2 కోట్లకు పైగా డోసులను వేశారు.

భారీగా వ్యాక్సినేషన్

భారీగా వ్యాక్సినేషన్

మోడీ బర్త్ డే సందర్భంగా భారీగా వ్యాక్సినేషన్ చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అర్హులు టీకా వేయించుకోవాలని.. అదే మోడీకి ఇచ్చే కానుక అని ఆరోగ్యమంత్రి మాన్సుక్ మాండవీయ కూడా అన్నారు. దీంతో ఇవాళ టీకా పంపిణీ జోరుగా కొనసాగింది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 2 కోట్ల డోసుల టీకాలను వేశారు. సాయంత్రం 5.10 గంటలకు 2 కోట్ల డోసులను వేశారు. రాత్రి వరకు ఇదీ 2.5 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఒకరోజులో 2 కోట్ల డోసులు టీకా వేసి.. భారత్ రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో డోసులను వేశారు. ఇవాళ్టితో కలిపి దేశంలో 79 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు. వచ్చేనెల నాటికి అదీ 100 కోట్లకు చేరే అవకాశం ఉంది.

థర్డ్ వేవ్..

థర్డ్ వేవ్..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!
వ్యాక్సిన్

వ్యాక్సిన్

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
India administered over 2.0 crore Covid-19 vaccine doses till 5.00 pm on Friday, achieving a new record on PM Narendra Modi's birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X