వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అతిపెద్ద మానవ పతాకం: భారత్ ప్రపంచ రికార్డు (ఫొటోలు)
చెన్నై: అతిపెద్ద మానవ పతాక ప్రదర్శనలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో 50వేల మందితో ‘అతి పెద్ద మానవ త్రివర్ణ పతాకం'గా ఏర్పడి భారతీయుల ఐకమత్యాన్ని, జాతీయ భావాన్ని ప్రపంచం నలుదిశలా చాటి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు పాకిస్థాన్ పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసింది. 28,957 మందితో లాహోర్ స్పోర్ట్స్ క్లబ్ పేరిట ఉన్న ఈ రికార్డును చెన్నైలో ఆదివారం జరిగిన అతి పెద్ద ఈ మానవ పతాక ప్రదర్శనతో తుడిచిపెట్టుకుపోయంది.

వైఎంసిఏ మైదానంలో 50వేల మందికిపైగా భారతీయులు ఆదివారం ఉదయం 8గంటలకు త్రివర్ణ ప్లకార్డులను పట్టుకుని ఈ రికార్డును సాధించారు. ‘మై ఫ్లాగ్ మై ఇండియా' ప్రచారంలో భాగంగా జరిగిన ఈ ప్రదర్శనను లక్షన్నర మంది తిలకించారు. ప్రదర్శన విజయవంతమైన వెంటనే గిన్నిస్ రికార్డును అందజేశారు.
