వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరమ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలోనే అత్యధికంగా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని పలు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నాయి. తాజాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనవల్లా కీలక ప్రకటన చేశారు.

 మౌత్‌వాష్‌‍లతో కరోనా ప్రభావంలో క్షీణత: శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి మౌత్‌వాష్‌‍లతో కరోనా ప్రభావంలో క్షీణత: శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్..

డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్..


ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని సీఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. వ్యాక్సిన్ ధరను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటీష్ స్వీడిష్ ఫార్మాసూటికల్ సంస్థ ఆస్ట్రజేనేకా సంస్థలు మరో రెండు నెలల్లో నిర్ణయిస్తాయని చెప్పారు. సీఐఐ ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థగా అవతరిస్తుందని తెలిపారు.

మనదేశంలోనే ట్రయల్స్.. వందల మిలియన్ల డోసులు..

మనదేశంలోనే ట్రయల్స్.. వందల మిలియన్ల డోసులు..

రెండు వారాల్లోపే తాము ట్రయల్స్ ప్రారంభిస్తామని పూనవల్లా తెలిపారు. ఐసీఎంఆర్‌తో భాగస్వామ్యంతో ట్రయల్స్ చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు నెల చివర నుంచే వాక్సిన్ల తయారీని ప్రారంభిస్తామని వివరించారు. ఐసీఎంఆర్ సహకారంతో భారతదేశంలో కొన్ని వేలమందిపై ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 300 మిలియన్ల నుంచి 400 మిలియన్ల వరకు డోసులను ఉత్పత్తి చేస్తామని పూనవల్లా తెలిపారు.

గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం..

గేట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం..

ఇది ఇలావుండగా, సీసీఐ గత వారం ప్రకటించిన మేరకు గవి ది వ్యాక్సిన్ అలియన్స్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంలో 100 మిలియన్ వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఇండియాతోపాటు ఇతర పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్ అందించనున్నట్లు పేర్కొంది. సీఐఐ ఇప్పటికే ఆస్ట్రజేనేకా, నోవావాక్స్ లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

Recommended Video

COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu
కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లు..

కోవిషీల్డ్ పేరుతో వ్యాక్సిన్లు..

ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఆక్స్‌ఫర్డ్, నోవావాక్స్‌కు చెందిన వ్యాక్సిన్‌లకు 100 మిలియన్ల డోసులను తయారు చేసి, భారత్ సహా 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్లు 2021 మధ్య నాటికి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, సీఐఐ కేవలం ఆక్స్ఫర్డ్ అభ్యర్థి వ్యాక్సిన్ తయారీకి దాని సామర్థ్యాన్ని పెంపొందించడానికి పెట్టుబడి పెట్టడానికి సుమారు 100 మిలియన్లను సమీకరించింది, దీనిని భారతదేశంలో 'కోవిషీల్డ్' అని పిలుస్తోంది. ఈ అభ్యర్థి వివిధ దేశాల్లోని వేలాది మంది వాలంటీర్లపై చివరి దశలో మానవ పరీక్షలు చేయించుకుంటున్నారు, వచ్చే వారం నాటికి 1,600 మంది పాల్గొనేవారిపై సీఐఐ భారతదేశంలో ఇలాంటి ట్రయల్స్‌ను ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.

English summary
Serum Institute of India (SII) chief executive officer Adar Poonawalla has said that India should have a coronavirus vaccine by December 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X