వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా నుంచి ఎస్- 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం

ఢిల్లీ: రెండురోజుల పర్యటన కోసం గురువారం భారత్ చేరుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు పుతిన్. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ఐదు ఎస్-400 క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

సుదూర లక్ష్యాలను చేధించగలిగే ఈ క్షిపణులు భారత రక్షణ వ్యవస్థలో చేరితే రక్షణ వ్యవస్థ మరింత బలపడనుంది. ముఖ్యంగా 4వేల కిలోమీటర్లు సరిహద్దున్న భారత్ చైనా సరిహద్దులో ఇవి తిష్టవేస్తే మరింత రక్షణపరంగా మరింత ఉపయోగం ఉంటుంది.

చంద్రబాబు ఎఫెక్ట్, అందుకే ఈ రోజు పెట్రోల్ ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ!చంద్రబాబు ఎఫెక్ట్, అందుకే ఈ రోజు పెట్రోల్ ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ!

రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ సుదూర లక్ష్యాలను చేధించగలదు. ఇది ఉపరితలం నుంచి గాలిలో ఉన్న ఎలాంటి లక్ష్యాన్నైనా చేధించగలదు. రష్యా నుంచి ఈ తరహా క్షిపణులు కొనుగోలు చేసిన దేశాల్లో చైనా మొదటిగా నిలిచింది. 2014లోనే చైనా రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది.

India signs deal with Russia to buy S-400 Missile system

ఇప్పటికే ఎస్-400 క్షిపణులను రష్యా బీజింగ్‌కు డెలివరీ చేసినట్లు పేర్కొంది. అయితే ఎన్ని సరఫరా చేశారనేదానిపై మాత్రం వెల్లడించేందుకు రష్యా నిరాకరించింది. ఎస్-300 క్షిపణి వ్యవస్థకు అపగ్రేడ్ వర్షెనే ఎస్-400 క్షిపణి వ్యవస్థ.ఈ క్షిపణి వ్యవస్థను రష్యాకు చెందిన అల్మాజ్-అంటే సంస్థ 2007 నుంచి ఉత్పత్తి చేస్తోంది.

అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు క్షిపణి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఆంక్షలు అమెరికా విధించకముందే కొన్నేళ్ల నుంచి భారత్‌కు ఆయుధాలు రష్యానే సరఫరా చేస్తోంది.

మిసైల్ కొనుగోలు ఒప్పందంతో పాటు అంతరిక్ష సహకారంపై కూడా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సైబీరియాలోని నోవోసిబిర్క్స్‌ నగరం దగ్గర ఇండియన్ మానిటరింగ్ స్టేషన్ నిర్మించేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం.

English summary
Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin have reportedly signed a deal for five Russian S-400 Triumf missile shield systems, one of the world's most lethal surface-to-air missiles.The long-range missile systems will bolster India’s air-defence capabilities along the 4,000-km-long India-China border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X