వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా రంగంలో దూసుకుపోతున్న భార‌త్..! 10 అగ్ర‌శ్రేణి దేశాల స‌ర‌స‌న ఇండియా..!!

|
Google Oneindia TeluguNews

దిల్లీ/హైద‌రాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్‌ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్‌-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. వినోదం పంచ‌డం, తాజా వార్త‌ల‌ను ప్ర‌జ‌ల‌కు చేర్చ‌డంలో ఆగ్ర దేశాల‌తో భార‌త్ పోటీ ప‌డుతుండ‌డం శుభ‌పరిణామంగా అభివ‌ర్ణిస్తున్నారు. ఇక ఈ నివేదికలో ఉన్న ఆస‌ర్తిక‌ర విష‌యాల గురించి తెలుసుకుందాం.

 మీడియా రంగంలో భార‌త్ కొంత పుంత‌లు..! నాణ్య‌మైన ప్ర‌సారాల‌తో పోటీ ప‌డుతున్న‌భార‌త్..!!

మీడియా రంగంలో భార‌త్ కొంత పుంత‌లు..! నాణ్య‌మైన ప్ర‌సారాల‌తో పోటీ ప‌డుతున్న‌భార‌త్..!!

మీడియా-వినోద రంగంపై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 32 డాలర్ల (.2,080రూపాయ‌లు)కు చేరే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే ఓటీటీ (కోరుకున్న వీడియోల వీక్షణ) విపణిలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. 2022 నాటికి ఈ మార్కెట్‌ 52.68 బిలియన్‌ డాలర్లకు (సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయ‌ల‌కు) చేరవచ్చు. ఇది 2017లో 30.36 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం దేశంలో బాగా పెరగడం, డేటా ఛార్జీలు తగ్గడం ఓటీటీ కంటెంట్‌ వృద్ధికి దోహదపడుతున్నాయి.

కోట్ల‌లో వ్యాపారం మీడియా రంగం ప్ర‌త్యేక‌త‌..! మ‌రింత పెరిగే అవ‌కాశం..!

కోట్ల‌లో వ్యాపారం మీడియా రంగం ప్ర‌త్యేక‌త‌..! మ‌రింత పెరిగే అవ‌కాశం..!

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్‌ 2017-22 మధ్య కాలంలో 10.1% వార్షిక వృద్ధి (సీఏజీఆర్‌) సాధించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్‌లో ఈ విభాగం ప్రస్తుత 297 మిలియన్‌ డాలర్ల (1,930 కోట్ల రూపాయ‌ల) స్థాయి నుంచి 2022 నాటికి 823 మిలియన్‌ డాలర్ల (5,350 కోట్ల రూపాయ‌లు) స్థాయికి చేరే అవకాశం ఉంది. అంటే సుమారు 22.6% వార్షిక వృద్ధి (సీజీఏఆర్‌) అన్నమాట. వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీఓడీ) విభాగంలో వృద్ధి బాగా నమోదు కావడం దీనికి ప్రధాన కారణంగా మీడియా దిగ్గ‌జాలు విశ్లేషిస్తున్నారు.

కంటెంట్ అందించ‌డంలో లోతైన క‌స‌ర‌త్తు..! ప్రేక్ష‌కుడి నాడి ప‌ట్టుకున్న మీడియా..!!

కంటెంట్ అందించ‌డంలో లోతైన క‌స‌ర‌త్తు..! ప్రేక్ష‌కుడి నాడి ప‌ట్టుకున్న మీడియా..!!

వినియోగదారుడికి ఎలాంటి కంటెంట్‌ అవసరమో దాన్ని అందించాలనే దృక్పథం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమ ఆ దృష్టితో ఆలోచించడం మొదలుపెట్టింది. 2021 నాటికి భారత్‌ మీడియా, వినోద తలసరి వ్యయం 2,080 రూపాయ‌లుగా ఉండొచ్చు. చైనా (14,430 రూపాయ‌లు), అమెరికాలతో (1.46 లక్షల రూపాయ‌ల‌) తో పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువ.

మీడియాకు రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్..! అగ్ర‌దేశాల‌కు పోటీ ఇస్తున్న భార‌త్..!!

మీడియాకు రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్..! అగ్ర‌దేశాల‌కు పోటీ ఇస్తున్న భార‌త్..!!

భారత్‌లో వీడియో-ఆన్‌-డిమాండ్‌ విభాగంలో ఎంపిక అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. ప్రధానంగా హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఎరోస్‌ నౌ తదితర సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి. ఇవిలో తమలో తామే పోటీ పడటంతో పాటు డీటీహెచ్‌ సంస్థలతో కూడా పోటీ పడాల్సి వస్తోంది. దీంతో మీడియా రంగంలో ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా నాణ్య‌మైన ప్ర‌సారాల‌ను ప్రేక్ష‌కుడికి అందించేందుకు మీడియా దూసుకుపోవ‌డ‌మే కాకుండా ప్ర‌పంచంలోని ఈట్ర ఆదేశాల‌కు పోటీ ఇస్తుంద‌ని చెప్పొచ్చు.

English summary
Our national interest continue to be an international entertainment and media market. According to the Assocham-PWC Report, India is likely to be one of the top 10 markets by 2021. India is competing with the nations in the field of entertainment and fresh news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X