వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత: వ్యూహాత్మక రోడ్లపై కదలిక

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో తూర్పు ప్రాంతంలో రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో తూర్పు ప్రాంతంలో రోడ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది.

మళ్లీ విషం చిమ్మిన చైనా: డోక్లాం వివాదంలో భారత్‌ను బద్నాం చేసే కథనం (వీడియో)మళ్లీ విషం చిమ్మిన చైనా: డోక్లాం వివాదంలో భారత్‌ను బద్నాం చేసే కథనం (వీడియో)

భారత్‌-చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడంపై దృష్టి సారించింది.

సరిహద్దు రోడ్ల సంస్థకు మరిన్ని అధికారాలు

సరిహద్దు రోడ్ల సంస్థకు మరిన్ని అధికారాలు

ఇందుకోసం సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్‌వో)కు మరిన్ని అధికారాలను ఇచ్చింది. 3,409 కి.మీ. నిడివి కలిగిన 61 రోడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

వ్యూహాత్మకంగా కీలకమైన రోడ్లు

వ్యూహాత్మకంగా కీలకమైన రోడ్లు

భారత్‌-చైనా సరిహద్దుల్లోని ఈ రోడ్లన్నీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. బీఆర్వో పనులు వేగవంతమయ్యేలా సంస్థలో మార్పులు తీసుకురావడమే తమ ఉద్దేశమని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

రూ.100 కోట్ల ఆర్థిక అధికారాలు అప్పగింత

రూ.100 కోట్ల ఆర్థిక అధికారాలు అప్పగింత

అదనంగా పరిపాలనాపరమైన అధికారాలివ్వడమే కాకుండా దేశ, విదేశాల నుంచి నిర్మాణ సామాగ్రి కొనుగోలు కోసం బీఆర్వో డైరెక్టర్‌ జనరల్‌కు రూ.100 కోట్ల వరకూ ఆర్థిక అధికారాలు అప్పగించింది.

ఇప్పటి వరకు ఇలా..

ఇప్పటి వరకు ఇలా..

ఇప్పటి వరకూ స్వదేశీ పరికరాల కొనుగోలుకు రూ.7.5 కోట్లు, విదేశాల నుంచి రూ.3 కోట్ల విలువైన పరికరాల సమీకరణకే అధికారం ఉండేది.

కొత్త సాఫ్టువేర్ అభివృద్ధి చేస్తున్నారు

కొత్త సాఫ్టువేర్ అభివృద్ధి చేస్తున్నారు

టర్న్‌కీ పద్ధతిలో రోడ్డు ప్రాజెక్టుల్లో భారీ నిర్మాణ కంపెనీల సేవలను బీఆర్వో పొందడానికి వీలు కల్పిస్తూ విధానపరమైన మార్గదర్శకాలకూ రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

English summary
India has decided to speed up construction of border roads in the eastern sector leading up to the Indian-Sino border. This is a significant development amidst the Doklam standoff and India aims are reducing the delay and removing bottlenecks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X