వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 పరీక్ష విజయవంతం, 4వేల కి.మీ. టార్గెట్‌ను ఛేదిస్తుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. 17 టన్నుల బరువు, 20 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి నాలుగు వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒక టన్ను న్యూక్లియర్ వార్ హెడ్‌ను ఇది మోసుకు వెళ్లగలదు.

India successfully carries out user trial of Agni iv

ఈ అగ్ని క్షిపణి-4ను ఒరిస్సా తీరం నుండి ఉదయం పది గంటల పందొమ్మిది నిమిషాలకు పరీక్షించారు. అనుకున్న సమయానికి దీనిని ప్రయోగ పరీక్ష చేశామని, ఈ ఏడాదిలో ఇది రెండో మిసైల్ పరీక్ష అని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ తెలిపింది.

దీనిని పరీక్షించేందుకు వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిని రైలు లేదా రోడ్డు మార్గంలో తీసుకు వెళ్లవచ్చు. అగ్ని-2కు అగ్ని-4 మోడిఫైడ్ వర్షన్. అగ్ని-2ను 2010 డిసెంబర్ 10వ తేదీన ప్రయోగించారు. అంతకుముందు, మొదటి పరీక్ష జనవరి 20వ తేదీన ఇదే ప్రాంతం నుండి చేశారు.

English summary
India successfully carries out user trial of Agni iv off Odisha coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X