వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్పెడో ప్రయోగం సక్సెస్: డ్రాగన్‌కు ధీటుగా.. సాగర గర్భంలో పనిపట్టే ‘స్మార్ట్’..

|
Google Oneindia TeluguNews

అడ్వాన్స్‌డ్ మిసైల్ టార్పొడేను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీంతో డ్రాగన్ చైనాకు గట్టి సంకేతాన్ని భారత్ పంపించింది. సబ్ మెరైన్లను గుర్తించిన వెంటనే తుత్తునియలు చేసే వ్యవస్థ ఇప్పటివరకు భారత్ వద్ద లేదు. అయితే ఆ లోటు తీరుస్తూ డీఆర్డీవో 'సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో అనే అస్త్రాన్ని తయారుచేసింది. ఓ బాలిస్టిక్ క్షిపణి, టార్పెడో కలయిక 'స్మార్ట్' గా పేర్కొనవచ్చు.

యుద్ధ నౌక నుంచి గానీ, తీర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన మొబైల్ లాంచర్ ద్వారా గానీ ప్రయోగించవచ్చు. తొలుత ఈ 'స్మార్ట్' మిసైల్ గాల్లో ప్రయాణిస్తుంది. సముద్రంలో ఉన్న జలాంతర్గామిని గుర్తించగానే, గగనతలం నుంచి దానికి అత్యంత సమీపానికి వెళుతుంది. ఆపై మిసైల్ నుంచి టార్పెడో వెలువడుతుంది. ఈ టార్పెడో సముద్ర జలాల్లోకి ప్రవేశించి సాగరగర్భంలో దాగివున్న శత్రుదేశ జలాంతార్గామిని నాశనం చేస్తుంది.

India Successfully Flight-Tests Advanced Missile-Torpedo System..

'స్మార్ట్' చాలా దగ్గరగా వచ్చిన తర్వాత టార్పెడోను రిలీజ్ చేస్తున్నందున.. జలాంతర్గామికి దీనిని గుర్తించే అవకాశం, తప్పించుకునే అవకాశం ఉండదు. హైబ్రిడ్ ఆయుధం సముద్ర జలాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 600 కిలోమీటర్ల. ఈ 'స్మార్ట్' అస్త్రాన్ని ఒడిశా తీరం నుంచి సోమవారం విజయవంతంగా పరీక్షించారు.

అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఇదివరకు ప్రయోగించాయి. స్మార్ట్ ప్రయోగంతో వాటి సరసన భారత్ చేరింది. చైనా వద్ద ఉన్న 'స్మార్ట్' తరహా ఆయుధ వ్యవస్థలో టార్పెడో సామర్థ్యం పరిమితం అని.. భారత్ వద్ద ఉన్న టార్పెడో శక్తి మరింత ఎక్కువ అని డీఆర్డీవో నిపుణులు చెబుతున్నారు.

English summary
India successfully flight-tested the Supersonic Missile Assisted Release of Torpedo (SMART) from Wheeler Island off the coast of Odisha on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X