వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం విజయవంతం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత సైన్యం మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. వరుస ప్రయోగాల్లో భాగంగా మంగళవారం భూ ఉపరితలం నుంచి మరో చోటుకు పరీక్షించింది. బ్రహ్మోస్ వాస్తవ దాడి పరిధి 290 కి.మీ ఉండగా, దాన్ని ఇప్పుడు 400 కిలోమీటర్లు పెంచారు.

అంతేగాక, శబ్ద వేగానికి మూడు రెట్లు లేదా 2.9 మాక్‌ల వేగాన్ని మెయింటెన్ చేశారు. భూమిపై దాడులకు సంబంధించిన బ్రహ్మోస్ వెర్షన్‌ను అండమాన్, నికోబార్‌లో ఉదయం 10 గంటలకు విజయవంతంగా ప్రయోగించామని సంబంధిత అధికారి మీడియాకు తెలిపారు.

India successfully launches BrahMos supersonic cruise missile.

మరికొద్ది రోజుల్లో గగన తలం, నీటి ఉపరితల వెర్షన్లను భారత వాయుసేన, భారత నౌకాదళం పరీక్షిస్తాయన్నారు. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు అత్యంత సమర్థంగా లక్ష్యాన్ని ఛేదిస్తాయన్న విషయం తెలిసిందే.

జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, నేలమీద నుంచి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఉద్రిక్తల నేపథ్యంలో చైనా సరిహద్దులోని లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే భారత్ వీటిని భారీ సంఖ్యలో మోహరించింది.

గత రెండు నెలల్లో భారత్ చాలా క్షిపణులను పరీక్షించింది. యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం-1' కూడా ఇందులోనే ఉంది. ఇటు పాకిస్థాన్, అటు పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణానికి కారణమవుతున్న నేపథ్యంలో భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఆధునాతన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. శత్రుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంటోంది.

English summary
India successfully launches BrahMos supersonic cruise missile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X