వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం: ఇక వైమానిక రంగంలోనూ..

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందిని సమీపంలో టెస్ట్‌ రేంజ్‌ నుంచి సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించినట్టు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తలు వెల్లడించారు.

క్షిపణి జీవిత కాలాన్ని పెంపొందించేలా భారతీయ శాస్త్రవేత్తలు తొలిసారిగా అభివృద్ధి చేసి నూతన సాంకేతికతను జోడించి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటికే సైనిక, నౌకాదళ రంగాల్లో బ్రహ్మోస్‌ సేవలందిస్తుండగా.. తాజా ప్రయోగంతో వైమానిక రంగంలోకీ అడుగుపెట్టినట్టయింది.

 India successfully test-fires BrahMos cruise missile from Odisha

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్‌ను భారత్‌, రష్యా దేశాలు సంయుక్తంగా రూపొందించాయి. దాదాపు రెండున్నర టన్నుల బరువు ఉండే బ్రహ్మోస్‌ క్షిపణిని భూమి, ఆకాశం, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు.

తాజా ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తల బృందానికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

English summary
India on Monday successfully conducted the first test of the BrahMos cruise missile under life extension program along the Odisha coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X