వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలికాలంలో చైనాకు తడిసిపోయేలా - యాంటీ రేడియేషన్ మిసైల్ ‘రుద్రం-1’ - డీఆర్డీవో టెస్టు సక్సెస్

|
Google Oneindia TeluguNews

రాబోయే చలికాలంలో పూర్తిస్థాయి యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటోన్న చైనాకు ప్యాంటు తడిసిపోయేలా భారత్ అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధంచేసుకుంది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణ రంగంలో కీలకమైన ముందడుగుగా భావిస్తోన్న 'రుద్రం-1' క్షిపణికి సంబంధించి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శుక్రవారం కీలక ప్రకటన చేసింది..

 జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు

యాంటీ రేడియేషన్..

యాంటీ రేడియేషన్..

సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే వీలున్న ‘రుద్రం-1' క్షిపణి... శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ధ్వని వేగం కంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్ళగలిగే ఈ అత్యాధునిక విస్సైల్ ను ‘‘వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిసైల్''గానూ వ్యవహరిస్తున్నారు. 250 కిలోమీటర్ల పరిథిలో రేడియేషన్‌ను వెలువరించే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. . రేడియో త‌రంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రేడార్ల‌ను ఈ మిస్సైల్ గుర్తించ‌గ‌ల‌దు.

సీబీఐ దాడుల వెనుక అసలు కథ - ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్‌మేట్ ద్వారా: ఎంపీ రఘురామ సంచలనంసీబీఐ దాడుల వెనుక అసలు కథ - ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్‌మేట్ ద్వారా: ఎంపీ రఘురామ సంచలనం

సుఖోయ్ యుద్ద విమానాల ద్వారా..

సుఖోయ్ యుద్ద విమానాల ద్వారా..


‘రుద్రం-1' మిస్సైల్ ను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించామని, ఒడిశాలోని బాలాసోర్ నుంచి దీనిని ప్రయోగించామని డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు.

Recommended Video

India-China Stand Off : China ను దెబ్బ తీసేలా LAC వద్ద Nirbhay Missile ‌ను మోహరించిన భారత్!
15కి.మీ ఎత్తు నుంచి కూడా..

15కి.మీ ఎత్తు నుంచి కూడా..


న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ గా పరిగణించే రుద్రం-1.. పరిధి విషయానికొస్తే.. దాన్ని తీసుకెళ్లే యుద్ధ విమానాల ఎత్తును బట్టి ఉంటుంది. అంటే, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చన్నమాట. ఈ మిసైల్‌తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే వీలుంటుంది. ఇటీవ‌ల వ‌రుస‌గా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను డీఆర్‌డీవో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భార‌త్‌.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ను ప‌రీక్షించింది.

English summary
India on Friday successfully tested Rudram 1, a tactical anti-radiation missile that the Indian Air Force (IAF) can fire from its Sukhoi-30MKI fighter jets to take down enemy radars and surveillance systems. The Defence Research and Development Organisation (DRDO) has developed the new-generation weapon. It was tested at the interim test range Balasore, off the coast of Odisha in the Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X