వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలిలో విమానాన్ని కూల్చేసిన క్షిపణి -డీఆర్డీవో తయారీ క్యూఆర్‌సామ్ పరీక్ష విజయవంతం

|
Google Oneindia TeluguNews

భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా కీలక ప్రణాళికలు రూపొందించుకున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణుల్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.

Recommended Video

#WATCH : DRDO మరో కీలక అడుగు.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన QRSAM ప్రయోగం సక్సస్!

'ఐ' తీస్తే శవం -'ఏ' తీస్తే మృతం -మాజీ సీఎం భార్యకు కౌంటర్ -పండుగ వేళ చావు రాజకీయం'ఐ' తీస్తే శవం -'ఏ' తీస్తే మృతం -మాజీ సీఎం భార్యకు కౌంటర్ -పండుగ వేళ చావు రాజకీయం

అన్ని రకాల వాతావరణాల్లో పనిచేసే 'క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని చందీపూర్ లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ అధునాతన క్షిపణులను పరీక్షించారు.

India successfully test-fires DRDO made QRSAM system; missile hits pilotless aircraft

గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా తాకింది. మీడియం రేంజి, మీడియం ఆల్టిట్యూడ్ లో ఈ పరీక్షల్ని చేపట్టారు. యుద్ధ రంగంలో శత్రు విమానాలను కూల్చగల సత్తా ఉన్న ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. క్యూఆర్ సామ్ తయారీలో 'ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఐఆర్డీఈ)కూడా పాలుపంచుకుంది.

16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎమ్)కు సంబంధిచి డీఆర్డీవో పరీక్షలు విజయవంతం కావడంతో తదుపరి దశలో స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానిక దళం పరీక్షించనుంది. ఆ తర్వత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లతో ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.

English summary
India on Friday successfully test-fired the Quick Reaction Surface to Air Missile (QRSAM) air defence system. The air defence missile system was tested from the Balasore flight test range. The missile hit its target directly during the test. The QRSAM, a compact weapon system, comprises two four-walled radars both of which encompass 360-degree coverage, namely, the Active Array Battery Surveillance Radar and the Active Array Battery Multifunction Radar, apart from the launcher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X