వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో అస్త్రం: జలాంతర్గామి నుంచి పరీక్ష చేసిన అణు క్షిపణి ప్రయోగం విజయవంతం

|
Google Oneindia TeluguNews

Recommended Video

India Successfully Test-Fires K-4 Ballistic Missile ! || Oneindia Telugu

విశాఖపట్నం: భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అణు క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈ కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది డీఆర్‌డీఓ. నేవీకి సేవలందిస్తున్న అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో ఈ అణుక్షిపణిని ఉంచుతారు. ఈ అణుక్షిపణి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

ఆదివారం రోజున ఉదయం సముద్ర గర్భం నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను చేధించేలా క్షిపణి ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాదు జలాంతర్గామి నుంచే ఈ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉండటంతో అదనపు బలం చేకూరినట్లయ్యిది. భారత్ తయారు చేస్తున్న అరిహంత్ అణు జలాంతర్గాములకు సపోర్ట్ చేసేలా ఈ క్షిపణిని రూపొందించారు. అణుజలాంతర్గాముల్లో మోహరించి ఉండేలా ఈ క్షిపణులు రూపొందిస్తున్నారు. అయితే జలాంతర్గాముల్లో మోహరింపు చేయడానికి ముందు మరికొన్ని ప్రయోగాలను చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఒకే ఒక అణు జలాంతర్గామి భారత నేవీకి సేవలందిస్తోంది.

India successfully test fires K-4 ballistic Missile

డీఆర్‌డీఓ రూపొందిస్తున్న సముద్ర గర్భ క్షిపణుల్లో కే-4 ఒకటిగా ఉంది. మరొకటి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల BO-5 క్షిపణి. క్షిపణ ప్రయోగ సమయంలో వాయుసేనకు, మెరైన్ విభాగాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సముద్ర గర్భం నుంచి క్షిపణి ప్రయోగం జరుగుతుందని జలాంతర్గామి పూర్తి స్థాయిలో రూపొందించిన తర్వాత దీనిపై నుంచి ప్రయోగం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంతకుముందు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే 2017 డిసెంబర్‌లో ఏకే-4 ఎస్‌ఎల్‌బీఎం ప్రయోగం విఫలమైంది. బ్యాటరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగం నాడు విఫలమైంది. కే-4 శ్రేణికి చెందిన క్షిపణిని చివరిసారిగా ఐఎన్‌ఎస్ అరిహంత్‌ జలాంతర్గామి నుంచి ఏప్రిల్ 2016లో ప్రయోగించారు.

English summary
India has succesfully tested k-4 ballistic missiles. It's one of the two underwater missiles that were being developed by DRDO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X