వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం: రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం సక్సెస్

|
Google Oneindia TeluguNews

చండీపూర్ : భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. రాత్రివేళల్లో లక్ష్యాలను చేధించగల ప్రథ్వీ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ అణుక్షిపణిని బుధవారం రాత్రి ఒడిషా తీరం నుంచి ప్రయోగించింది . రెండు పృథ్వీ క్షిపణులను వరుసగా ప్రయోగించినట్లు చెప్పిన ఇంటరిమ్ టెస్టు రేంజ్ అధికారి... రెండు క్షిపణులు తాము నిర్దేశించిన లక్ష్యాలను పారామీటర్లను అందుకున్నాయని వెల్లడించారు.

350 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల పృథ్వీ 2 క్షిపణిని లాంచ్‌ కాంప్లెక్స్ -3లో ఉన్న మొబైల్ లాంచర్‌ నుంచి ఈ ప్రయోగించారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి 7గంటల 15 నిమిషాల మధ్య ఈ ప్రయోగం జరిగిందని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రయోగం రొటీన్‌గా జరిగేదే అని చెప్పిన అధికారులు, క్షిపణి యొక్క పారామీటర్లను రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం, టెలిమెట్రీ స్టేషన్ల ద్వారా డీఆర్‌డీఓ ట్రాక్ చేసిందని వెల్లడించారు. అప్పటికే ఉన్న స్టాక్ నుంచి యాదృచ్చికంగా క్షిపణి ఎంపిక జరిగిందని ఇక పూర్తి ప్రయోగాన్ని ఆర్మీ విభాగమైన స్ట్రాటిజిక్ ఫోర్స్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. మిషన్ మొత్తాన్ని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు పర్యవేక్షించినట్లు చెప్పారు.

ఇక క్షిపణి ల్యాండింగ్‌ను పర్యవేక్షించేందుకు ఆల్యాండింగ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఓ నౌకలో మరో టీమ్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక చివరిసారిగా రాత్రివేళల్లో ఒక క్షిపణి ప్రయోగం గతేడాది ఫిబ్రవరిలో జరిగిందని చెప్పారు. తాజాగా రెండు క్షిపణులను వరుసగా ప్రయోగించినట్లు ఆయన చెప్పారు. ఇక పృథ్వీ-2 విషయానికొస్తే ఇది 500 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలు మోసుకెల్లగలదని వివరించారు. ఈ క్షిపణి రెండు లిక్విడ్ ప్రపల్షన్ ట్విన్ ఇంజిన్ సహాయంతో నడుస్తుందని అధికారులు తెలిపారు. ఇక నిర్దేశించిన లక్ష్యాలను చేధించేందుకు అత్యాధునిక అడ్వాన్స్ టెక్నాలజీని వినియోగిస్తుందని వెల్లడించారు.

India successfully test-fires nuclear capable Prithvi-II off Odisha coast

ఇప్పటికే అంటే 2003లోనే పృథ్వీ క్షిపణిని భారత రక్షణ వ్యవస్థకు చెందిన అమ్ములపొదిలో ఉంచారు. 9 మీటర్ల పొడవు ఉన్న పృథ్వీ క్షిపణి డీఆర్‌డీఓ తయారు చేసిన తొలి క్షిపణిగా నిలిచింది. ఇంటెగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద ఈ క్షిపణిని తయారు చేసింది డీఆర్‌డీఓ.

English summary
India successfully testfired on Wednesday night its indigenously developed nuclear capable surface-to-surface Prithvi-2 missile as part of a user trial by the Army from a test range off Odisha coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X