వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్ని -5: చైనాకు ఇండియా షాక్, అమెరికా సరసన భారత్, ఇక టార్గెట్ ఇదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

చైనాకు ఇండియా షాక్.. ఇక టార్గెట్ ఇదే !

న్యూఢిల్లీ: అగ్ని -5 క్షిపణిని భారత్ విజయవంతంగా జనవరి 18వ, తేదిన ప్రయోగించింది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చైనాలో వనుకు పుడుతోంది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేసే శక్తి ఉంది. ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో ఇండియా చేరింది.

ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్

చైనా ఇటీవల కాలంలో ఇండియాను లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా అవకాశాలను వాడుకొంటుంది. అదే సమయంలో పాకిస్థాన్‌కు చైనా అన్ని రకాలుగా సహయ సహకారాలను అందిస్తోంది.

ఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణంఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణం

ఇండియా సరిహద్దు వెంట చైనా ఆర్మీ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. సియాచిన్, డోక్లామ్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చైనా పూనుకొంది. శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.

 అగ్ని -5 విజయవంతంతో చైనాలో వణుకు

అగ్ని -5 విజయవంతంతో చైనాలో వణుకు

అగ్ని -5 విజయవంతం కావడంతో చైనాలో వణుకు మొదలైందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 18వ, తేదిన ఈ క్షిపణిని చైనా విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ ఈ క్షిపణి ధ్వంసం చేయనుంది. దీంతో చైనాకు వణుకు మొదలైందని రక్షణ నిపులు అభిప్రాయపడుతున్నారు.

 ఆసియాతో పాటు యూరప్‌ 70 శాతం ఇండియా పరిదిలోకి

ఆసియాతో పాటు యూరప్‌ 70 శాతం ఇండియా పరిదిలోకి

ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇండియా పరిధిలోకి ఆసియా ఖండం మొత్తం వచ్చింది. యూరప్‌లోని 70 శాతం భూభాగం వచ్చి చేరుతోందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చైనాలోని ఉత్తరప్రాంతం మొత్తం ఇప్పడు భారత్‌ క్షిపణి పరిధిలోకి వచ్చేస్తోంది.

అమెరికా సరసన చేరిన భారత్

అమెరికా సరసన చేరిన భారత్

అగ్ని -5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాల సరసన ఇండియా చేరిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ ఖండాతర బాలిస్టిక్‌ మిస్సైల్‌ క్లబ్‌లో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యూకే సరసన చేరింది. మొత్తానికి చూస్తే భారత్‌తో పాటు ఇప్పుడు అన్ని దేశాలకూ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణలు ఉన్నట్లే.

 అగ్ని-6 పై ఇండియా పరీక్షలు

అగ్ని-6 పై ఇండియా పరీక్షలు

అగ్ని- 5 సక్సెస్ అవ్వడంతో భారత్‌ అగ్ని-6పై దృష్టిపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేగానీ జరిగితే తమ సీఎస్‌ఎస్‌-10 స్థాయిని అలవోకగా అందుకుంటుందని చైనా తీవ్ర ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్‌ రీ ఎంట్రీ టెక్నాలజీపై కూడా దృష్టి పెట్టనుంది. ఒక వేళ ఇదేగానీ వర్కవుట్ అయితే ఒకే క్షిపణితో ఏకాలంలో పలు లక్ష్యాలపై దాడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary
India tested a long-range ballistic missile capable of carrying nuclear weapons on Thursday, paving the way for membership to a small list of countries with access to intercontinental missiles and putting most of China in its reach.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X