వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా గౌరవాన్ని దెబ్బతీశాడు : ట్రంప్‌తో సమావేశం కావొద్దు .. మోడీకి సీతారం ఏచూరి డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జీ-20 సదస్సులో సమావేశమయ్యే ఒకరోజు ముందు వస్తువులపై పన్నుపై భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం ఏంటని ప్రశ్నించింది సీపీఎం. ఓ దేశానికి భయాభాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికింది. భారత్‌ను అవమానానికి గురిచేసిన ట్రంప్‌తో ప్రధాని మోడీ చర్చలు జరపకూడదని డిమాండ్ చేసింది.

కీలక అంశాలపై చర్చ .. ట్రంప్, అబేతో మోడీ భేటీకీలక అంశాలపై చర్చ .. ట్రంప్, అబేతో మోడీ భేటీ

సరికాదు ..
అమెరికాకు చెందిన 29 వస్తువులపై భారత్ దిగుమతి సుంకం విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న ట్రంప్ భారత్ వైఖరిని తప్పపట్టారు. దీనిని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. గతంలో భారతదేశాన్ని ఏ దేశం, ఏ నాయకుడు ఇలా అవమానపరచలేదని గుర్తుచేశారు. ట్రంప్ చేసిన ట్వీట్ దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. అంతేకాదు ఆయన బీజేపీ పార్టీని కూడా కించపరిచాడని పేర్కొన్నారు. ఓ దేశాధినేత బహిరంగంగా విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ చర్చలకు దూరంగా ఉండాలని కోరారు. ఇది ఓ వ్యక్తికి సంబంధించిన అంశం కాదు .. దేశ గౌరవానికి సంబంధించిన విషయమని నొక్కి వక్కానించారు. అంతేకాదు ప్రధాని పదవీకి ఉన్న గౌరవానికి సంబంధించిన విషయమని గుర్తుచేశారు. దీంతో అధికార బీజేపీ కఠిన వైఖరి అవలంభించాలని గుర్తుచేశారు.

India threatened and insulted, PM told off: Sitaram Yechury after Donald Trumps tweet

ఇదీ విషయం
అమెరికా నుంచి భారత్ దిగుమతి అయ్యే 25 వస్తువులపై ఇండియా పన్ను పోటు పొడిచింది. దీంతో అమెరికా ఆదాయానికి భారీగా గండిపడనుంది. భారత్ ఎగుమతి చేసే వస్తువులకు అమెరికా కూడా పన్ను విధించింది. దీంతోపాటు ప్రాధాన్య వాణిజ్య హోదా నుంచి భారత్‌ను తొలగించిన నేపథ్యంలో భారత్ పన్ను విధిస్తున్నట్టు స్పష్టంచేసింది. స్టీల్, అల్యూమినియం అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది. గతేడాది మార్చి నుంచి వీటిపై ట్యాక్స్ విధిస్తోంది అమెరికా. అయినప్పటికీ భారత్ ఊరుకుంది. జీఎస్పీ కార్యక్రమం నుంచి కూడా భారత్‌‌ను అమెరికా తొలగించింది. దీంతో ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని స్పష్టంచేసింది. 25 ఉత్పత్తులపై ఈ నెల 16 నుంచి ట్యాక్స్ వసూల్ చేస్తుంది. ఆ ఉత్పత్తుల్లో బాదం, వాల్ నట్స్, కాయ తదితర వస్తువులు ఉన్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి నిన్న స్పందించారు. అమెరికా వస్తువులపై భారత్ పన్ను విధించడం సరికాదన్నారు. తాము విధిస్తున్న పన్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. శుక్రవారం మోడీతో సమావేశం కానున్న నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ప్రాధాన్యం కలిగించాయి.

English summary
A day after Donald Trump said he looks forward to meeting Prime Minister Narendra Modi at G20 summit about the increased tariffs on American products, Communist Party of India (Marxist) General Secretary Sitaram Yechury said that India has never been insulted and threatened like this before. Taking to Twitter, Sitaram Yechury said that Donald Trump's tweet is about India's self-respect. He also slammed the Bharatiya Janata Party (BJP) for not speaking up for the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X