వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు

|
Google Oneindia TeluguNews

''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్ది.. ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించే స్థాయిలో నిలబెట్టడం'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ అభియాన్ లో భాగంగా రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలంటే ఏం చేయాలనే టాపిక్ పై నిర్వహించిన వెబినార్ లో గురువారం ఆయన కీలక ప్రసంగం చేశారు.

సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?

దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని.. ఆ క్రమంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రైవేటు ప్లేయర్లకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు. భారత రక్షణ రంగంలో 74 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే సమయంలో భారత రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చే లక్ష్యంతో కొన్ని రకాల విదేశీ రక్షణ పరికరాల దిగుమతిపై ఆంక్షలు విధించిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.

 India to allow 74% FDI in defence, ‘Aatmanirbhar’ Bharat’ is not inward-looking: PM Modi

''రక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్ చాలా కాలంగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. నిజానికి మనకు స్వాతంత్ర్యం రావడం కంటే ముందు నుంచే(దాదాపు 100 ఏళ్ల నుంచే) ఈ గడ్డపై పలు రకాల రక్షణ పరికరాలు ఉత్పత్తి అయ్యాయి. దురదృష్టవశాత్తూ తొలినాళ్లలో ప్రభుత్వాలు ఆ అంశంపై దృష్టిపెట్టలేదు. దీంతో క్రమంగా మనం దిగుమతులకు అలవాటుపడ్డాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తాం'' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.

 India to allow 74% FDI in defence, ‘Aatmanirbhar’ Bharat’ is not inward-looking: PM Modi

రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూనే, సొంతకాళ్లపైనా భారత్ ఎదుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. కీలకమైన ఈ వెబినార్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తోపాటు త్రివిధ దళాలకు చెందిన ముఖ్య అధికారులు, వివిధ శాఖల సెక్రటరీలూ పాల్గొన్నారు.

English summary
The prime minister further said that a decision has been taken to permit up to 74% FDI (foreign direct investment) in the defence manufacturing through automatic route. While addressing an event on making India self-reliant in defence sector through video conference, Prime Minister Narendra Modi said on Thursday that government aims to increase defence manufacturing in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X