వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైవేలపై ఇక టోల్ గేట్స్ ఉండవు -రెండేళ్లలో సాధిస్తామన్న గడ్కరీ -మరి టోల్ ఫీజు ఎలా?

|
Google Oneindia TeluguNews

రాబోయే రోజుల్లో హైవేలపై టోల్ బూతులు కనిపించవని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ బూత్ లెస్ హైవేస్ కోసం కేంద్రం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు రెండేళ్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన అన్నారు. అదే టైంలో టోల్ ఫీజు వసూలు కోసం మోడ్రన్ టెక్నాలజీని ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు.

గురువారం 'అస్సోచమ్ ఫౌండేషన్ వీక్' ప్రోగ్రాంలో గడ్కరీ మాట్లాడుతూ.. టోల్ ఫీజు ఏర్పాట్ల కోసం జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. గత కొన్ని నెలల్లో ఫాస్ట్‌టాగ్ వాడకం గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈ మధ్య వస్తున్న ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ దాదాపుగా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ తో ఉంటున్నవే. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రష్యా ప్రభుత్వ సహకారంతో జిపిఎస్ వ్యవస్థను ఖరారు చేసినట్లు వివరించారు.

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనంజగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

India to be tollbooth-free in 2 years says Nitin Gadkari, GPS technology for toll collection

టోల్ ఫీజుని నేరుగా బ్యాంకు అకౌంట్ నుండి చెల్లించే వెసులుబాటు కల్పించబోతున్నట్లు ఆయన చెప్పారు. అయితే కొత్త వెహికిల్స్ జీపీఎస్ ట్రాకింగ్తో వస్తున్నప్పటికీ, పాత వెహికిల్స్ విషయంలో మాత్రం కొంత టెక్నాలజీ అప్ డేట్ చేయాల్సి ఉంటుదని, ఆ చొరవ ప్రభుత్వమే తీసుకుంటుందని గడ్కరీ అన్నారు. టోల్ వసూలు కోసం జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ .1,34,000 కోట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

పెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషిపెళ్లి పేరుతో సెక్స్ -ప్రతిసారి నేరం కాబోదు -హైకోర్టు సంచలన తీర్పు - రేప్ కేసులో వ్యక్తి నిర్దోషి

English summary
Union Minister of Road Transport & Highways and MSMEs Nitin Gadkari has said that the Government has finalised GPS-based(Global Positioning System) technology toll collection to ensure seamless movement of vehicles across the country. He said, this will ensure India becomes ‘toll booth free’ in the next two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X