వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మర్ క్షిపణి ఎమర్జెన్సీ ఆర్డర్: భారత్ విజ్ఞప్తికి ఫ్రాన్స్ ఓకే..పర్వత ప్రాంతాల్లో లక్ష్యాల చేధన

|
Google Oneindia TeluguNews

తూర్పు లడాఖ్ వద్ద నుంచి చైనా బలగాలు పూర్తి స్థాయిలో నిష్ర్కమించకపోవడంతో.. భారత్ కూడా అందుకు ధీటుగానే వాయుసేన దళాలను మొహరించింది. రాఫెల్ యుద్ధ విమానాలకు మరింత బూస్ట్ ఇచ్చే హమ్మర్ క్షిపణులను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అర్జెంట్ ఆర్డర్ కోరగా.. అందుకు ఆ దేశం కూడా సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఇతరులకు ఇవ్వాల్సిన హమ్మర్ క్షిపణులను భారత్‌కు అందజేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

Recommended Video

India-China Face Off : China మెడ వంచేలా భారత్ ప్లాన్.. ఫ్రాన్స్ తో ఒప్పందం! || Oneindia Telugu

హమ్మర్ క్షిపణులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా లక్ష్యాలను గురిపెట్టగలవు. ముఖ్యంగా భూతలంలో ఎలాంటి సిచుయేషన్ అయినా ఎదుర్కొగలవరు. పర్యత ప్రాంతాల్లో కూడా కచ్చితత్వంతో లక్ష్యాలను ఎదుర్కొంటాయి. రాఫెల్ విమానాల కోసం హమ్మర్ క్షిపణులు తక్కువ సమయంలోనే పంపించేందుకు ప్రాన్స్ ప్రభుత్వం అంగీకరించిందని భారత ప్రభుత్వ వర్గాల ఏఎన్ఐ వార్తాసంస్థకు పేర్కొన్నది .అయితే హమ్మర్ కొనుగోలు అంశాన్ని ఐఎఫ్ ప్రతినిధిని వివరణ కోరగా.. అందుకు వారు నిరాకరించారు.

India to boost Rafale capabilities with HAMMER missiles via emergency order..

రూ.500 కోట్లతో ఆయుధ సంపత్తిని పెంచుకోవాలంటూ భారత ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛని ఇచ్చింది. జూలై 29వ తేదీన ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. అయితే రాఫెల్ సామర్ధ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు హమ్మర్ మిస్సెల్స్‌కు ఆర్డర్ ఇచ్చింది. వీటి ద్వారా రాఫెల్ యుద్ధ విమానాల సామర్ధ్యం మరింత పెరగనుంది. ఈ హమ్మర్ మిస్సెల్స్‌ 60-70 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేయగలవు. లదాఖ్‌ వంటి మంచు కొండల్లో ఉన్న లక్ష్యాలను కూడా సులువుగా చేధించగలవు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన మిస్సెల్స్‌కు భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Indian Air Force is further boosting the capabilities of the combat aircraft by equipping it with the HAMMER missiles from France.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X