వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపఎన్నికలు ఎగ్జిట్ పోల్స్: యూపీ, ఎంపీ, గుజరాత్‌లలో బీజేపీదే హవా, హస్తం బేజారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కీలకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28, గుజరాత్ రాష్ట్రంలో 8, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ హవా కొనసాగించింది.

వీటితోపాటు కర్ణాటకలో 2, జార్ఖండ్ రాష్ట్రంలో 2, ఒడిశాలో 2, నాగాలాండ్‌లో 2, హర్యానాలో 1, ఛత్తీస్ గఢ్‌లో 1, తెలంగాణలో ఒక అసెంబ్లీ స్తానానికి ఉపఎన్నికలు జరిగాయి.

Bihar: ABP-C VOTER EXIT POLL: 'తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..Bihar: ABP-C VOTER EXIT POLL: 'తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఎగ్పిట్ పోల్స్: చౌహాన్ సర్కారుకు ఢోకాలేదు

మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఎగ్పిట్ పోల్స్: చౌహాన్ సర్కారుకు ఢోకాలేదు

ఇండియాటూడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్టిల్ ప్రకారం.. 16-18 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఢోకాలేకుండా పోతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ 46 శాతం పెరగగా, కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు కేవలం 2 శాతం పెరిగింది. ఇక ఉపఎన్నికలో బీఎస్పీకి 0-1 స్థానం దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. జ్యోతిరాదిత్య సింధియా 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు బీజేపీలో చేరడంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి.

ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్

ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్

ఇండియా టూడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరు స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో ఐదింటినీ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. సమాజ్ వాదీ పార్టీ 1-2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. బీఎస్పీ 0-1 స్థానం గెలిచే అవకాశం ఉంది.
ఈ అంచనాలు నిజమైతే, ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి ఓట్ల వాటా 37 శాతంగా ఉంది. అదే సమయంలో, యూపీలో కాంగ్రెస్ ఓటు వాటా 8 శాతం, ఎస్పీ తన 27 శాతం ఓట్ల వాటాను కలిగి ఉండగా, బీఎస్పీ కూడా తన 20 శాతం ఓట్ల వాటాను కలిగి ఉంది.

గుజరాత్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్:

గుజరాత్ ఉపఎన్నికల ఎగ్జిట్ పోల్స్:

గుజరాత్ రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో.. 49 శాతం ఓట్ల వాటా ఉన్న బిజెపి.. ఈ అసెంబ్లీ స్థానాల్లో 6-7 తేడాతో గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా, గుజరాత్‌లో 40 శాతం ఓట్ల వాటాతో కాంగ్రెస్ ఉప ఎన్నికలకు వెళ్ళిన 0-1 సీట్లను సాధించగలదు. ఇతర పార్టీలు గుజరాత్‌లో 11 శాతం ఓట్ల వాటాను కలిగి ఉన్నాయి.

English summary
India Today-Axis My India exit poll predicts BJP likely to dominate bypolls in MP, UP and Gujarat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X