వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూలో ఆడియో టేపు పార్ట్-2, వీడియోలో ఏబీవీపీకి చెందిన కోమల్ ,చెప్పొద్దని సీనియర్‌కు వేడుకోలు..

|
Google Oneindia TeluguNews

జేఎన్‌యూలో గత ఆదివారం జరిగిన ఘటనల గురించి 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రెండో టేపులో ఏబీవీపీకి చెందిన రోహిత్ షా, మూడో టేపులో వామపక్షాలకు చెందిన విద్యార్థి గీతా కుమారి గురించి స్టింగ్ ఆపరేషనల్ ఇండియా టుడే రిపోర్టర్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

పార్ట్-2లో కోమల్ శర్మ

పార్ట్-2లో కోమల్ శర్మ

పార్ట్-2 అంటూ మరో వీడియోను ‘ఇండియా టుడే' విడుదల చేసింది. ఇందులో ఏబీవీపీకి చెందిన మరో విద్యార్థిని కోమల్ శర్మ ఉన్నారని స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్నది. ఆమె జేఎన్‌యూలో చదువుతోన్నారని, ఏబీవీపీ కార్యకర్త అని వివరించింది. వీడియోలో మొహానికి మాస్క్ వేసుకున్న ఫోటోలు, చేతిలో కర్ర పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆడియో టేపులు కూడా ట్రోల్ అవడంతో.. కోమల్ శర్మ తన ఉనికిని తెలియజేయొద్దని సీనియర్లను వేడుకుంటున్న ఆడియోలు కూడా బహిర్గతమవుతోన్నాయి. అయితే ఆమె కోమల్ శర్మ అని జేఎన్‌యూలో సీనియర్ విద్యార్థి ఒకరు ‘ఇండియా టుడే' రిపోర్టర్‌కు తెలియజేశారు.

ఆడియో టేపుల కలకలం

ఆడియో టేపుల కలకలం

జేఎన్‌యూలో ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించి రెండో టేపు ఇది, శుక్రవారం అక్షత్ అవస్తీ ఆడియో టేపులను రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. అక్షత్ అవస్తీ, రోహిత్ షా, గీతా సింగ్ వర్సిటీలో.. దాడులు చేసేందుకు పాల్పడిన విషయాన్ని ఆడియో టేపులను ఇండియా టు డే వెల్లడించింది.

ముగ్గురు..

ముగ్గురు..

జేఎన్‌యూలో ఆడియో టేపుల పార్ట్-1 వ్యవహారానికి సంబంధించి ఇండియా టు డే స్టింగ్ ఆపరేషన్‌లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రోహిత్ షా, వామపక్షాలకు చెందిన గీతా సింగ్ పాత్రను రిపోర్టర్ ప్రపంచానికి తెలియజేశారు. అక్షత్ ఫ్రెంచ్ బీఏ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతన్నారు. కర్ర పట్టుకొని, మొహానికి అక్షత్ మాస్క్ వేసుకోగా.. అతనికి రోహిత్ హెల్మెట్ ఇచ్చారు. దీనిని రోహిత్ కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.

గీత పాత్ర

గీత పాత్ర

జేఎన్‌యూ విధ్వంసంలో వామపక్ష పాత్రను కూడా ఆడియో టేపులు బహిర్గతం చేశాయి. మూడో విద్యార్థి గీతా కుమారి.. వామపక్ష విద్యార్థి సంఘం ఐసాకు చెందినవారని ఇండియాటుడే రిపోర్టర్ పేర్కొన్నారు. సర్వర్ గదిని మూసివేశామని.. వర్సిటీలో వీసీ తమను ఏమీ చేయనీయరని.. ఆన్‌లైన్‌లో హ్యాపీ న్యూ ఇయర్ పంపిస్తోందని.. కోడ్ భాషలో పేర్కొన్నారు. ఇప్పుడు పరీక్షలు లేవు, డిమాండ్లు నెరవేరే పరిస్థితి లేదు.. అందుకే సర్వర్ గదిని మూసివేయాలని నిర్ణయించుకున్నామని గీతాకుమారి ఆడియో టేపులను కూడా శుక్రవారం ఇండియా టుడే వెల్లడించింది.

English summary
Komal Sharma, masked woman in viral video of jnu violence India Today exposes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X