వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాది పాలనపై సర్వే: బాగుంది కానీ, ఐనా ప్రధానిగా మోడీనే బెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ఏడాది పాలన బాగుందని, అయితే బీజేపీ చెప్పుకొంటున్నంతగా మంచి రోజులు రాలేదని జనం అభిప్రాయపడుతున్నారు. మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఇండియాటుడే-సిసిరో దేశవ్యాప్త సర్వే నిర్వహించింది.

లోకసభ ఎన్నికలనాటితో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పంగా పెరిగిందని తేల్చింది. ఈ సర్వేలో 7652 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 56శాతం మోడీ పాలన బాగుందన్నారు. ద్రవ్యోల్బణం అదుపు, ధరలకు కళ్లెం, విదేశాంగ విధానం, స్వచ్ఛభారత్‌, అవినీతి నియంత్రణ మోడీ విజయాలుగా అభివర్ణించారు.

ముఖ్యంగా స్వచ్ఛభారత్‌‌కు పలికారు. ఈ కార్యక్రమంవల్ల తమ పరిసరాలు బాగుపడ్డాయని 57శాతం తెలిపారు. పేదలందరికీ బ్యాంకు ఖాతా జన్‌ధన్‌ యోజన‌కూ భారీ ప్రశంసలు లభించాయి.

India Today survey on One year of Narendra Modi government

సూటు-బూటు సర్కార్‌ అంటూ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలో నిజం లేకపోలేదని 43శాతం అభిప్రాయపడ్డారు. రెండు నెలల కిందటి సర్వేలో మోడీ ప్రభుత్వం పేదలకు అనుకూలమని 16శాతం మాత్రమే అభిప్రాయపడగా, ఇప్పుడది 23 శాతానికి పెరిగింది.

రైతుల సమస్యలను పరిష్కరించలేకపోవడమేనని 30 శాతం చెప్పారు. మోడీ తమ అంచనాలకు తగినట్లు పని చేయడం లేదని 46శాతం తెలిపారు. ప్రస్తుత నేతల్లో ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్నకు 2014 ఆగస్టు నాటి సర్వేలో 57శాతం మోడీకి జేజేలు కొట్టారు.

ఇప్పుడు 33శాతానికి పడిపోయింది. మోడీ హయాంలో మైనారిటీలపై దాడులు జరగడంలేదని 51 శాతం అభిప్రాయపడ్డారు. మంచి రోజులు వచ్చాయా అన్న ప్రశ్నకు- 53శాతం అలాంటివి కనిపించడం లేదని చెప్పారు. తాము సోషల్‌ మీడియాలో మోడీని ఫాలో కావడం లేదని 72శాతం చెప్పారు.

మారుమూల పల్లెల్లో సైతం వినిపించేందుకు మోడీ ఎంచుకున్న మన్‌కీ బాత్‌‌కూ పెద్దగా స్పందన లేదు. రేడియోలో ప్రసారమయ్యే ఈ ప్రసంగాన్ని విననేలేదని 56శాతం చెప్పారు. చివరగా ప్రధాని పదవికి మోడీయే తగిన వ్యక్తి అని నిర్ద్వంద్వంగా తేలింది. 11 శాతమే రాహుల్‌ అయితే బాగుంటుందన్నారు.

English summary
India Today survey on One year of Narendra Modi government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X