వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు ట్వీట్.. చిక్కుల్లో జర్నలిస్ట్ రాజ్‍దీప్ సర్దేశాయ్ -2వారాలపాటు ఆఫ్ ఎయిర్, జీతం కట్!

|
Google Oneindia TeluguNews

దేశంలో టాప్ జర్నలిస్టుల్లో ఒకరైన రాజ్‍దీప్ సర్దేశాయ్ వృత్తిపరమైన చిక్కుల్లో పడ్డారు. రిపబ్లిక్ డే నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనను ఉద్దేశించి ఆయన చేసిన ఓ తప్పుడు ట్వీట్ పై దుమారం చెలరేగడంతో యాజమాన్యం చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

భారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు -WEF's Davos Dialogueలో ప్రధాని మోదీభారత్ నుంచి మరిన్ని వ్యాక్సిన్లు -WEF's Davos Dialogueలో ప్రధాని మోదీ

ప్రస్తుతం ఇండియా టుడే టీవీలో కన్సల్టింగ్ ఎడిటర్ హోదాలో సీనియర్ యాంకర్ గా పనిచేస్తోన్న రాజ్‍దీప్ సర్దేశాయ్.. ఆ ఛానెల్ ప్రైమ్ టైమ్ డిబేట్ సహా ముఖ్యమైన అంశాలపై చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. కాగా, రాబోయే రెండు వారాలపాటు ఆయనను కార్యక్రమాల నుంచి తొలగించడం(ఆఫ్ ఎయిర్)తోపాటు జీతంలో కోత కూడా విధిస్తూ యాజమాన్యం చర్యలకు దిగినట్లు సమాచారం..

India Today Takes Rajdeep Sardesai Off-Air for 2 Weeks, Cuts Pay: reports

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులు.. ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం, పోలీసులు నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోకి రైతులు చొచ్చుకొని రావడంతో హింస చెలరేగడం, సెంట్ర‌ల్ ఢిల్లీలోని ఐటీవో జంక్ష‌న్ ద‌గ్గ‌రైతే పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం, అడ్డగింతలతో ఉద్రిక్తత చెలరేగడంతో.. పోలీసులను తప్పించుకుని స్పీడ్‌గా వెళ్తున్న ఓ ట్రాక్ట‌ర్ బోల్తా పడటంతో ఉత్త‌రాఖండ్ కు చెందిన న‌వ‌నీత్ సింగ్‌ అనే రైతు చనిపోయాడు. తొలుత ఈ మరణానికి కారణం పోలీసుల తూటాలే అనే ప్రచారం జరిగింది. రాజ్‍దీప్ సర్దేశాయ్ కూడా రైతు మరణానికి కారణం పోలీసుల తూటాలే అని ట్వీట్ చేశారు. కానీ..

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరంచంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం

Recommended Video

రేపే బల పరీక్ష.... గోవా సీఎం కుర్చీపై కాంగ్రెస్ కన్ను....!! | Oneindia Telugu

పోలీసుల వివరణ, సీపీటీవీ ఫుటేజీల ప్రకారం రైతు నవనీత్ ప్రమాదవశాత్తూ మరణించాడే తప్ప, కాల్పుల్లో కాదని నిర్ధారణ అయింది. దీంతో రాజ్‍దీప్ సర్దేశాయ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. టాప్ జర్నలిస్టుగా ఉంటూ నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఎలా ట్వీట్ చేస్తారంటూ బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. నిజానికి ఆయనీ ట్వీట్ ను వ్యక్తిగత ఖాతా నుంచే చేశారుగానీ, ఇండియా టుడే వార్తల్లోగానీ, ట్వీట్లలోగానీ ఎక్కడా ఆ విషయాన్ని(రైతు తూటాలకు బలైనట్లు) పేర్కనలేదు. అయినాసరే, ఇండియా టుడే యాజమాన్యం రాజ్‍దీప్ సర్దేశాయ్ పై చర్యలకు పూనుకుందని, రెండు వారాలపాటు కార్యక్రమాల నిలిపివేత, జీతంలో కోత విధించిందని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించేందుకు రాజ్‍దీప్ నిరాకరించారు.

English summary
India Today has taken senior anchor and consulting editor Rajdeep Sardesai off the air for two weeks for a tweet saying that the farmer who was killed during a tractor rally on Republic Day had died in police firing, The Wire reported on Thursday. The channel has also deducted a month’s salary from the anchor. Sardesai has refused to comment on this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X