వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా సైనిక ఈవెంట్... ఆహ్వానాన్ని తిరస్కరించిన భారత్... కారణమదే...

|
Google Oneindia TeluguNews

వచ్చే నెలలో సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 27 వరకు దక్షిణ రష్యాలో 'Exercise Kavkaz 2020' పేరుతో జరగనున్న సైనిక బలప్రదర్శనలో పాల్గొనేందుకు రష్యా పంపించిన ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించింది. కోవిడ్ 19 కారణంగానే భారత్ దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రష్యాకు తెలిపింది. అయితే ఇందులో చైనా కూడా పాల్గొంటుండటమే భారత్ విముఖతకు అసలు కారణమన్న వాదన వినిపిస్తోంది.

సరిహద్దులో చైనాతో గత మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు రష్యా సైనిక ఈవెంట్‌లో పాల్గొనేందుకు చైనా సమ్మతం తెలిపింది. అటు పాకిస్తాన్ కూడా ఈ ఈవెంట్‌కు తమ సైన్యాన్ని పంపించే అవకాశం ఉంది. మొత్తంగా దాదాపు 13వేల మంది సైనికులు ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

India turns down Russias invite to take part in multilateral military exercise amid border row with China

నిజానికి భారత్ కూడా ఈ సైనిక ఈవెంట్‌కు తమవంతుగా దాదాపు 180 మంది సైనికులను పంపించాలని భావించింది. అలాగే 40 మంది ఎయిర్ ఫోర్స్,ఇద్దరు నేవీ అధికారులను పంపించాలనుకుంది. కానీ ఆ తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకుంది.

గతేడాది రష్యా నిర్వహించిన Tsentr సైనిక ఈవెంట్‌లో పాకిస్తాన్,చైనాతో పాటు భారత్ కూడా పాల్గొన్నది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సభ్య దేశాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. రష్యా సైనిక ఈవెంట్‌లో భాగంగా 2018,2019లో నిర్వహించిన ఎస్‌సీవో శాంతి మిషన్‌‌లో మొదటిసారి భారత్ పాల్గొన్నది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతో రష్యా ప్రతీ ఏటా సైనిక బల ప్రదర్శనను చేపడుతూ వస్తోంది.

English summary
India on Saturday turned down Russia’s invitation to participate in next month’s multilateral defence exercise, which is scheduled to be held in southern Russia between September 15 and 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X