వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Namaste Trump: చిరకాల బంధమంటూ ప్రధాని మోడీ ప్రసంగం, మెలానియా ట్రంప్‌పై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: భారత్-అమెరికా మధ్య స్నేహ బంధం పరిఢవిల్లాలి అని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు సోమవారం మధ్యాహ్నం నేతలంతా చేరుకున్నారు.

నమస్తే ట్రంప్ అంటూ..

నమస్తే ట్రంప్ అంటూ..

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నమస్తే ట్రంప్ అని అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని అన్నారు.భారత్-అమెరికా మైత్రి బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయమని, ఈ బంధం కలకాలం వర్ధిల్లాలని అన్నారు.

Recommended Video

Namaste Trump : Twitter War On Trump Pronunciations | Oneindia Telugu
అప్పుడు హోడీ మోడీ- ఇప్పుడు నమస్తే ట్రంప్

అప్పుడు హోడీ మోడీ- ఇప్పుడు నమస్తే ట్రంప్

అమెరికాలో జరిగిన హౌడీ-మోడీకి కొనసాగింపుగానే ఈ నమస్టే ట్రంప్ కార్యక్రమం అని మోడీ వ్యాఖ్యానించారు. మొతేరా స్టేడియం చరిత్రను తిరగరాస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికా భారత్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటోందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహ బంధం మరింత పెరగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అమెరికాలో స్టాచూ ఆఫ్ లిబర్టీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుండగా.. భారతదేశంలో స్టాచూ ఆఫ్ యూనిటీ(సర్దార్ పటేల్ విగ్రహం) ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిలిచిందన్నారు.

మెలానియా ట్రంప్‌పై ప్రశంసలు

మెలానియా ట్రంప్‌పై ప్రశంసలు

అంతేగాక, అమెరికా అధయక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్‌పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆమె తమ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుపేద పిల్లలు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు.

కిక్కిరిసిన మోతెరా స్టేడియం..

కిక్కిరిసిన మోతెరా స్టేడియం..

అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అనంతరం ట్రంప్ దంపతులు నేరుగా మోతెరా స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో మోతేరా స్టేడియం కిక్కిరిసిపోయింది. లక్షా 20వేల మంది హాజరుకావడం గమనార్హం.

థ్యాంక్స్ ట్రంప్.. చిరకాలం బంధం

థ్యాంక్స్ ట్రంప్.. చిరకాలం బంధం

ట్రంప్ ప్రసంగం అనంతరం మరోసారి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత చరిత్ర, అభివృద్ధిని కొనియాడినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ సాధించిన అభివృద్ధిని మోడీ వివరించారు. అమెరికాతోనే అత్యధిక వాణిజ్య ఒప్పందాలు భారత్ చేసుకుందని చెప్పారు. రక్షణ రంగంతోపాటు చాలా రంగాల్లో అమెరికాతో సత్ససంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. భారత్-అమెరికా కలిసి సాంకేతికంగా దూసుకెళ్తాయని అన్నారు. ఉగ్రవాదంపై ఇరుదేశాలు సంయుక్తంగా పోరాటం చేస్తాయన్నారు. భారత్-అమెరికా స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
India-US relations longer just another partnership, says narendra modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X