వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ త్రీకి చేరువలో ఇండియా..కరోనా కేసులలో రష్యాకు దగ్గరగా...24గంటల్లో 22,771 కేసులు

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోంది. తన ప్రతాపం చూపిస్తోంది. ఇక భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది. చాప కింద నీరులా కరోనా దేశమంతా విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే ఇరవై మూడు వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెరికాలో కంట్రోల్ చెయ్యలేని స్థితిలో కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో కొత్త కేసుల నమోదు ఇదే విధంగా జరిగితే త్వరలోనే భారత్ రష్యాను దాటి కరోనా కేసులలో టాప్ త్రీ లో ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

టీఆర్ఎస్ లో తిష్ట వేసిన కరోనా ... ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే సునీతకు కరోనా పాజిటివ్టీఆర్ఎస్ లో తిష్ట వేసిన కరోనా ... ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే సునీతకు కరోనా పాజిటివ్

 ఒకేరోజులో 22,771 కేసులతో ఇండియాలో కరోనా కేసుల రికార్డ్ బ్రేక్

ఒకేరోజులో 22,771 కేసులతో ఇండియాలో కరోనా కేసుల రికార్డ్ బ్రేక్

భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. కరోనావైరస్ ను కట్టడి చేయడం కష్టం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకేరోజులో 22,771 కేసుల అతిపెద్ద పెరుగుదలతో భారతదేశ కరోనా కేసుల సంఖ్య 6,48,315 ను తాకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం.గత 24 గంటల్లో దేశంలో 442 మరణాల నమోదు జరిగింది.దీంతో మొత్తం మరణాల సంఖ్య 18,655 కు చేరుకుంది. రికవరీల సంఖ్య 3,94,227 గా ఉంది. రికవరీ రేటు 60.80 శాతానికి మెరుగుపడింది. ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ సంక్రమణకు సంబంధించి 2,35,433 క్రియాశీల కేసులు ఉన్నాయి. ధృవీకరించబడిన మొత్తం కేసులలో విదేశీయులు కూడా ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్లకు చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య

ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్లకు చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య

ప్రపంచంలో నాలుగవ అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన దేశంగా భారతదేశం ఉంది . ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 11 మిలియన్లకు చేరుకుందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం శనివారం తాజా సమాచారం ప్రకారం. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 523,613 మందికి పైగా మరణించినట్లు విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల చూస్తే పరిస్థితి కంట్రోల్ లో లేదని అర్ధం అవుతుంది.

యూఎస్ లో 24 గంటల్లో 57,683 కేసులు , రష్యాకు చేరువలో ఇండియా

యూఎస్ లో 24 గంటల్లో 57,683 కేసులు , రష్యాకు చేరువలో ఇండియా

శుక్రవారం 24 గంటల్లో 57,683 కోవిడ్ -19 కేసులను అమెరికా గుర్తించింది, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్క ప్రకారం, వరుసగా మూడవ రోజు రికార్డ్ బ్రేక్ చేస్తూ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 728 కరోనా మరణాలు నమోదు అయ్యాయి , మొత్తం యూఎస్ మరణాల సంఖ్య 129,405 కు చేరుకుంది. యూఎస్ లో కరోనా వైరస్ దారుణ పరిస్థితి తీసుకువచ్చింది. అగ్ర రాజ్యం కరోనా కంట్రోల్ లో దారుణంగా విఫలం అవుతుంది . భారతదేశం ఇప్పుడు యుఎస్, బ్రెజిల్ మరియు రష్యా తర్వాత స్థానంలో ఉంది. భారతదేశం రష్యా కరోనావైరస్ కేసులకు దగ్గరగా ఉంది.భారతదేశంలో 6.48 లక్షల కేసులు ఉండగా, రష్యాలో 6.66 లక్షల కరోనావైరస్ కేసులు ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ట్రాకర్ తెలిపింది.

ఇండియాలో మహారాష్ట్ర , తమిళనాడుల స్థితి దారుణం

ఇండియాలో మహారాష్ట్ర , తమిళనాడుల స్థితి దారుణం

1,92,990 కి పైగా కరోనా కేసులతో మహారాష్ట్ర దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. శుక్రవారం 198 కొత్త మరణాలు సంభవించిన తరువాత కరోనా మరణాల సంఖ్య 8,376 కు పెరిగిందని ఆరోగ్య శాఖ ప్రకటన తెలిపింది.దేశంలో రెండవ కరోనావైరస్ తో దెబ్బతిన్న రాష్ట్రమైన తమిళనాడులోని COVID-19 లెక్కింపు నిన్న లక్షను దాటింది. దక్షిణాది రాష్ట్రంలో 4,329 మందికి ఒకే రోజులో రోజులో పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న ఒక్క రోజే 64 మంది మరణించగా రాష్ట్ర మరణాల సంఖ్య 1,385 గా ఉందని ప్రభుత్వ సమాచారం.

Recommended Video

Coronavirus Vaccine : India's Second COVID-19 Vaccine Produced By Zydus Cadila || Oneindia Telugu
 రోజు రోజుకూ అధ్వానంగా ఇండియా పరిస్థితి .. భారత్ మెడపై కరోనా కత్తి

రోజు రోజుకూ అధ్వానంగా ఇండియా పరిస్థితి .. భారత్ మెడపై కరోనా కత్తి

ఇప్పటివరకు ఒకేరోజులో 22,771 కేసుల అతిపెద్ద పెరుగుదలతో భారత్ రికార్డు బ్రేక్ చేసింది . భారతదేశ కరోనా కేసుల సంఖ్య 6,48,315. ఏదేమైనా కరోనా కేసులు పెరుగుతున్న తీరు మరొకసారి లాక్ డౌన్ పై ప్రజల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఇక కరోనాను కంట్రోల్ చేయలేకపోతున్న ప్రభుత్వాలు తీవ్ర అసహనంలో ఉన్నాయి. భారత్ మెడపై కరోనా కత్తి వేలాడుతుంది . ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలు కూడా కరోనా కల్లోలంలో దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి .

English summary
India's COVID-19 tally touched 6,48,315 with the biggest single-day increase of 22,771 cases, . The country also witnessed 442 deaths during the period, taking the total number of death count to 18,655. However, India has furthered inched closer to Russia’s tally of coronavirus cases.While India has 6.48 lakh cases, Russia has 6.66 lakh coronavirus cases, according to the Johns Hopkins University tracker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X