motera : మొతెరా స్టేడియం ప్రారంభించిన రాష్ట్రపతి-మోడీ పేరు-భారత్, ఇంగ్లండ్ టెస్టుకు రెడీ
భారత్-ఇంగ్లండ్ మధ్య ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు గుజరాత్‌లోని మొతెరా స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. సర్గార్ పటేల్ స్టేడియంగా పిలిచే ఈ మైదానాన్ని పలు మార్పులు చేసి నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. భారత్‌లో రెండో పింక్‌బాల్ టెస్టుకు ఆతిధ్యమిస్తున్న ఈ స్టేడియాన్ని ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌షా, ఆయన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
మొతెరా స్టేడియం ప్రారంభం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న మొతెరాలోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంబించారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య డేనైట్ పింక్‌బాల్ టెస్టుకు ఆతిధ్యమివ్వనున్న ఈ స్టేడియాన్ని కోవింద్... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, బీసీసీ కార్యదర్శి జై షాతో కలిసి ప్రారంభించారు. ఈ స్టేడియానికి ప్రధాని మోడీ పేరుతో నరేంద్రమోడీ స్టేడియంగా నామకరణం చేశారు.

ఇవాళ్టి నుంచి మొతెరాలో పింక్ బాల్ టెస్టు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న చారిత్రక సర్దార్ పటేల్ స్టేడియానికి కొన్ని మార్పులు చేసి ప్రధాని మోడీ పేరుతో నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. భారత్‌లో జరిగే రెండో పింక్‌బాల్ డేనైట్ టెస్టుకు ఇది ఆతిధ్యం ఇవ్వబోతోంది. ఇవాళ సాయంత్రం భారత్-ఇంగ్లండ్ టెస్టు ఇక్కడ ప్రారంభం కానుంది. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన సందేశాన్ని పంపారు. భారత్‌లో జరుగుతున్న ఈ రెండో పింక్‌బాల్ టెస్టుకు స్టేడియంలో గ్యాలరీలన్నీ నిండుతాయని ఆశిస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మొతెరా
మార్పుల తర్వాత మెతెరా స్టేడియం ప్రపంచంలోనే అత్యంత సామర్ధ్యం కలిగిన స్టేడియంగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఎంసీజీ 90 వేల కెపాసిటీతో తొలి స్ధానంలో ఉండగా.. మొతెరా లక్షా 10 వేల కెపాసిటీతో ఆ రికార్డును అధిగమించింది. ఇందులో నాలుగు ప్రపంచ స్ధాయి డెస్సింగ్ రూమ్‌లు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు మాత్రం 55 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.