వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు భారత్ వార్నింగ్.. హద్దులు దాటారో ఖబడ్దార్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారమైన జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్ నాయకులు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. భారత్‌లో హింస చెలరేగేలా పాకిస్తాన్ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్... పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసింది.

యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ విభజించిన నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలను భారత్ సీరియస్‌గా పరిగణించింది.పాకిస్తాన్ నాయకులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు రవీష్ కుమార్. ఒక దాయాది దేశంగా మాత్రమే పాకిస్తాన్ వ్యవహరిస్తే మంచిదని రవీష్ కుమార్ అన్నారు. గత మూడు వారాలుగా పాక్ ప్రధాని భారత్‌పై అణుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో భారత్ సీరియస్ అయ్యింది. జనవరి 2016లో పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ దాడి తర్వాత ఆ దేశంతో చర్చలకు స్వస్తి పలికింది భారత్. చర్చలు ఉగ్రవాదం రెండు ఒక చోట ఉండవని భారత్ తేల్చి చెప్పింది.

India warns Pak, says behave just like neighbour

గల్ఫ్ ఆఫ్ కచ్ ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్తాన్ మెరైన్ కమాండోలు ప్రయత్నిస్తున్నారని చెప్పిన రవీష్ కుమార్ తమ నిఘా వర్గాలు ఇస్తున్న సమాచారంతో అలర్ట్‌గా ఉన్నట్లు తెలిపారు.పాకిస్తాన్ ఇలాంటి చొరబాట్లకు చెక్ చెప్పకపోతే పరిస్థితి సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు. తమ గడ్డపై నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్నారని అది ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తప్పుడు సంకేతాలు పంపుతోందని మండిపడ్డారు రవీష్ కుమార్. అంతేకాదు కశ్మీర్‌లో హింసకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రవీష్ కుమార్.

ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కశ్మీర్ తీర్మానం తమ విదేశీ విధానాల్లో తొలి అజెండాగా భావిస్తున్నట్లు పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. ద్వైపాక్షిక చర్చల కోసం పాకిస్తాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నిందని.. అయితే భారత్ మాత్రం ముందుకు రాలేదని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి మొహ్మద్ ఫైసల్ చెప్పారు.

English summary
Condemning the recent remarks made by Pakistani leadership on India’s internal matters, the Ministry of External Affairs Thursday said ‘the provocative statements include call for jihad and inciting violence in India’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X