వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకున్న ఇండియా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల కోసం ప్రపంచ బ్యాంకు అప్పు ఇస్తుంటుంది. ఇందుకు సంబంధిత నియమాలు, నిబంధనలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా .. ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకుంటుంది. గత పదేళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు భారతదేశం తీసుకునే అప్పు పెరుగుతూనే ఉంది. గత నాలుగేళ్లలోనే 5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది ఇండియా.

India was the largest borrower from World Bank for 3 of last 4 years

కీలక రంగాలకు కేటాయింపు
2009 నుంచి తీసుకుంటోన్న రుణం ఏటేటా పెరుగుతోంది. ఈ రుణంతో కీలక రంగాలపై ఖర్చుచేస్తోంది. అయితే 2010 తర్వాత ప్రపంచబ్యాంకు అన్నిదేశాలకు ఇచ్చే రుణాన్ని తగ్గిస్తోంది. 2010 ఆర్థికమాంద్యం ఏర్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా తీసుకున్న రుణం ద్వారా రహదారుల అభివృద్ధి, విద్యుత్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విపత్తుల నిర్వహణశాఖ కోసం ఖర్చు చేస్తోంది.

ఆర్థికమాంద్యంతో తగ్గిన రుణం
2010లో ఇండియా 9.3 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఆర్థికమాంద్యం ఏర్పడటంతో ఆ మరుసటి ఏడాది నుంచి రుణం ఒక్కసారిగా తగ్గిపోయింది. కీలక రంగాలకే నిధులు కేటాయించాలని భారతదేశానికి ప్రపంచ బ్యాంకు స్పష్టంచేసింది. ఏటేటా రుణ విలువ కూడా తగ్గిస్తూ వస్తోంది. అలాగే ఒడిశా - ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుపాను సాయం కింద రుణం అందజేసిందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.

English summary
India was the largest borrower from the World Bank for six of the last 10 years, data from the multilateral lending institution shows, reflecting the growing need for development finance in the world’s fastest growing large economy. Between 2009 and 2018, the bank provided assistance to India across sectors like road and power infrastructure, agriculture, health, education and disaster management, shows ThePrint’s analysis of the projects funded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X