వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతమాత ముద్దుబిడ్డకు ఘనస్వాగతం .. సరిహద్దులో అభికి గ్రాండ్ వెల్ కం

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ : భారతమాత ముద్దుబిడ్డ, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ 130 కోట్ల భారతవని ఘనస్వాగతం పలికింది. మిగ్ విమానం పాకిస్థాన్ భూభాగంలో పడటంతో .. అందులోని ఫైలట్ అభినందన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ధ్రువీకరించి .. చర్చలకు పిలువడం అభినందన్ విడుదల చేయాల్సిందేనని ఇండియా తేల్చిచెప్పడంతో ఎట్టకేలకు ఆయన విడుదలయ్యారు.

యోధ .. వెల్ కం

యోధ .. వెల్ కం

దాదాపు రెండు రోజులు .. శత్రు దేశం పాకిస్థాన్ లో .. ఎప్పుడు .. ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఉంది. యావత్ భారతజాతి. కానీ గుంటనక్క పాకిస్థాన్ లో ఉన్న అభినందన్ .. అంతా టెన్షన్ పడినట్టుగా కనిపించలేదు. చెదరని గుండె ధైర్యం .. మనోనిబ్బరంతో ఉన్నారాయాన.

వాఘా వద్ద వందనం ..

వాఘా వద్ద వందనం ..

పాకిస్థాన్ శాంతి కాముకమని .. అభినందన్ ను విడుదల చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంట్ లో ప్రకటించారు. శుక్రవారం విడుదల చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఒక్కటే హడావిడి .. అభికి స్వాగతం పలికేందుకు భారీ జనసమూహం సరిహద్దుకు చేరుకున్నారు.

నిబంధనల ప్రకారం ..

నిబంధనల ప్రకారం ..

శుక్రవారం ఉదయం నిబంధనల మేరకు అప్పగింత ప్రక్రియ కొనసాగింది. ఆర్మీ అధికారులు అత్యంత పకడ్బందీగా .. జామర్ ఉన్న వాహనంలో తరలించారు. అంతకుముందు సరిహద్దు వద్ద భారత వాయుసేన, ఇతర అధికారులు అభినందన్ కోసం వేచిచూశారు. అలాగే భారీగా జనం కూడా తరలొచ్చారు. దేశం కోసం పోరాడిన వీరుడికి నినాదాలతో హోరెత్తించారు. నిబంధనల ప్రకారం భారత వాయుసేన ఉన్నతాధికారులు అభినందన్ కు అప్పగించారు.

వైద్య పరీక్షలు ..

వైద్య పరీక్షలు ..

అభినందన్ కు స్వాగతం పలికిన అధికారులు .. అక్కడే ఉన్న అంబులెన్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడినుంచి అమృత్ సర్ తరలించి .. అటు నుంచి ఢిల్లీ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

English summary
India's wing commander, Abhinandan vardhaman, welcome India. The MiG flight fell into Pakistan's territory and the Pakistani army was found. Pakistan has confirmed the matter and calling it for talks to India. after abhi release we talk to you clarifys india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X