వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

India-Wide Vaccine Dry Run -నేడు దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు

|
Google Oneindia TeluguNews

కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. శనివారం(జనవరి 2న) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్​ నిర్వహిస్తున్నది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు నేడు తలపెట్టిన డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందివ్వనున్నారు. అసలైన టీకాల పంపిణీలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది. కేంద్ర నిపుణుల కమిటీ ఇప్పటికే సీరం-ఆక్స్ ఫర్డ్ తయారీ 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను భారత్ లో అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా వచ్చేవారమే ఒరిజినల్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

 కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు, ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు, వ్యాక్సిన్‌ రవాణా విషయంలో అవాంతరాలను గుర్తించడంతోపాటు.. క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్‌ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికే ఇవాళ్టి(జనవరి 2నాటి) డ్రై రన్‌ను నిర్వహిస్తున్నామని కేంద్రం ఇదివరే స్పష్టం చేసింది.

India-Wide Vaccine Dry Run Today as Govt Plans to Start Inoculation Drive Next Week

ఆయా ముఖ్య పట్టణాల్లో కనీసం మూడేసి కేంద్రాల్లో(సెషన్‌ సైట్స్‌) డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళలాంటి రాష్ట్రాల్లో ముఖ్యపట్టణాల నుంచి పలు జిల్లాలకు కనెక్టివిటీ సరిగా లేనందున రాజధాని నగరాలతోపాటు, ఇతర పట్టణాల్లోనే డ్రైరన్‌ చేపట్టనున్నారు.

ఇవాళ్టి డ్రైరన్ లో.. ప్రతి కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు డ్రైరన్‌ వ్యాక్సిన్‌ వేస్తారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం తయారు చేసిన కొ-విన్‌ యాప్‌లో డ్రైరన్‌-ఆరోగ్య కార్యకర్తల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో శిక్షకులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ ప్రక్రియ కోసం..

ఇప్పటి వరకు 96 వేల మంది వ్యాక్సినర్లు శిక్షణను పూర్తిచేసుకున్నారు. వారిలో 2.360 మందికి జాతీయ శిక్షకుల శిక్షణ కేంద్రంలో.. 57 వేల మంది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శిక్షణ పొందారు. స్టోరేజీ కేంద్రం నుంచి వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు టీకాను తరలించడం, వ్యాక్సిన్‌ను తెరవడం వంటి అంశాలపై వారు తర్ఫీదు పొందారు.

క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామక్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ

నేటి డ్రైరన్ లో భాగంగా వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక సిరంజీలు వాడుతున్నారు. ఇందు కోసం 85 కోట్ల సిరంజీలను కేంద్రం సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్‌, కొ-విన్‌ సాఫ్ట్‌వేర్‌ విషయంలో అనుమానాల నివృత్తికి 104, 1075 టోల్‌ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. వ్యాక్సినేషన్‌ సెంటర్లలో ప్రతి కేంద్రంలో వెయిటింగ్‌ రూమ్‌, టీకా స్టోరేజీలు ఎలా ఉండాలి? ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించాలనే అంశాలపైనా ఆదేశాలు జారీ అయ్యాయి.

గతేడాది డిసెంబర్ 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, అసోం, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో తొలిదశ డ్రైరన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. సీరం సంస్థ భాగస్వామిగా, ఆస్ట్రాజెనెకా కంపెనీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌)కు భారత్ లో వినియోగానికి గురువారం గ్రీన్ సిగ్నల్ లభించింది. భారత్ బయోటెక్ వారి 'కొవాగ్జిన్'కు కూడా త్వరలోనే ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఈ రెండు వ్యాక్సిన్ల పంపిణీ వచ్చే వారం నుంచే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
After successfully concluding the coronavirus vaccination dry run in four states, a similar mega-drill will be conducted in all states and union territories on Saturday. An expert panel of the country’s drug regulator on Friday recommended emergency use authorisation be granted to the Oxford-AstraZeneca vaccine. The approval by the Subject Expert Committee of the Central Drugs Standard Control Organisation (CDSCO) paves the way for mass immunisation with the vaccine to begin within the next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X