వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతి ప్రయోజనాలే ముఖ్యం, రష్యాతో బంధం కొనసాగుతుంది .. అమెరికా మంత్రికి తేల్చిచెప్పిన జై శంకర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ ప్రయోజనాల కోసమే ఇండియా పాటుపడుతుందని కేంద్రం స్పష్టంచేసింది. ఇందులో ఇసుమంతైనా సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది. తమకు దేశం, జాతి ప్రయోజనాలు ముఖ్యమని నొక్కి వక్కానించింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో భారత్‌లో పర్యటిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌తో సమావేశమయ్యారు.

కీలక చర్చలు ..
ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ 400 క్షిపణుల గురించి డిస్కస్ జరిగింది. దీనిపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పొంపియో. అయితే తమకు జాతి ప్రయోజనాలే ముఖ్యమని జై శంకర్ తేల్చిచెప్పారు. మేం ఇతర దేశాలతో పరస్పర సహకారంతో కలిసి పనిచేస్తామని స్పష్టంచేశారు. ఇండియా తమ ముఖ్య భాగస్వామ్యమని ఈ సందర్భంగా పొంపియో తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు.

India will do what is in its national interest: Jaishankar to Pompeo on S-400 deal

అందరూ సమానమే ...
రష్యాతో క్షిపణి ఒప్పందంపై పొంపియో ప్రధానంగా లేవనెత్తగా .. తాము రష్యాతోపాటు ఇతర దేశాలతో కూడా రక్షణపరంగా సాయం తీసుకుంటామని జై శంకర్ తెలిపారు. ఇప్పటికే చాలా దేశాల సహకారం కూడా తీసుకున్నామని గుర్తుచేశారు. ఇది తమ జాతి ప్రయోజనాల కోసం చేస్తున్న పనులని తెలిపారు. ఆయా దేశాలతో పనిచేయాలనేది తమ వ్యుహాత్మక విధానమని పేర్కొన్నారు. అయితే ఇండియా-అమెరికా భాగస్వామ్యం అనేది మరింత ధృఢంగా ఉండాలని కోరుకుంటున్నానని జై శంకర్ స్పష్టంచేశారు. శక్తి, ఉత్పాదన, వాణిజ్యం, ఆఫ్గనిస్థాన్, ఇండో ఫసిఫిక్ ప్రాంతాల సమస్యలపై కూడా చర్చించామని జై శంకర్ తెలిపారు. సరిహద్దులో ఉగ్రవాదం పెట్రేగిపోతుందని ప్రస్తావించగా .. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృశనిశ్చయంతో ఉన్నారని పొంపియో తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదమొట్టించేందుకు అన్నిదేశాలతో కలిసి పోరాడుదామని పొంపియో చెప్పినట్టు సమాచారం.

English summary
India on Wednesday told the US that it will go by its national interest while dealing with other countries, including with sanctions-hit Russia from whom New Delhi is procuring S 400 missile defence systems. This was conveyed by External Affairs Minister S Jaishankar to his American counterpart Mike Pompeo during an extensive bilateral meeting here. In a joint press interaction, Pompeo said India is an important partner of the US and that the bilateral ties were reaching new heights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X