వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పైనే చర్చలు.. తేల్చి చెప్పిన రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌తో కేవలం పీఓకే వివాదంపైనే చర్చలు కొనసాగిస్తామని, అది కూడ పాకిస్థాన్ పూర్తిగా ఉగ్రవాదులను నిర్మిలించినప్పుడే సాధ్యమవుతుందని కేంద్ర డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.హర్యాణలోని అశీర్వాద్ సభలో పాల్గోన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కశ్మీర్ విభజపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పిర్యాధు చేసిన తర్వాత మొదటి సారిగా రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు,రాష్ట్ర విభజన తర్వాత భారత దేశంపై అనేక చర్యలకు పాల్పడిన పాకిస్థాన్ చివరకు ఐక్యరాజ్యసమితి తలుపు తట్టింది. దీంతో కశ్మీర్ అంశం భారత అంతర్గత విషయమని భారత దేశం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే భారత్ చర్యలు చేపట్టింది. ఇక కశ్మీర్‌లో "ఆర్టికల్ 370 రద్దుతో ఐక్యరాజ్యసమితిలో పిర్యాధు చేసిన పాకిస్థాన్ భారత్ తప్పు చేసినట్టు పిర్యాధు చేసిందని, అయితే పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా మానేస్తేనే..పాకిస్థాన్‌తో చర్చలు జరుపుతామని, అది కూడ పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపైనేనని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

India will hold talks only on PoK, Union Defence Minister Rajnath Singh said

మొత్తం పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజంలో భారతదేశం కట్టడి చేయడంతో పాకిస్థాన్ ఒంటరి అయింది. దీంతో భారత్ చకచక పావులు కదుపుతోంది. ఇప్పటికే కశ్మీర్‌లో ఎన్నికలు జరిపేందుకు సిద్దమవుతున్న భారత్ ఇందుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. దీంతో పీవోకే కూడ తమదే అని స్పష్టం చేసిన కేంద్రం అక్కడ కూడ ఎన్నికలు జరిపేందుకు సన్నద్దమవుతోంది. ఓవైపు కశ్మీరీల మద్దతు లభించక మరోవైపు అంతర్జాతీయంగా కూడ అనుకున్న స్థాయిలో మద్దతు లభించకపోవడంతో కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

English summary
talks with Pakistan will only be held when the neighbours stop harbouring terrorists. that from now on, India will hold talks only on PoK, Union Defence Minister Rajnath Singh said.After Pakistan approached several foreign nations and the United Nations seeking intervention in the Kashmir matter ,Rajnath Singh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X