• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు: ఐరాసపై మోడీ ఫైర్(పిక్చర్స్)

|

బ్రస్సెల్స్: సమష్టి బలంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో బుధవారం సమావేశమైన ఆయన ఉగ్రవాదం ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే ఎదుర్కోవాలని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా నేరస్థుల పరస్పర మార్పిడి, ఖైదీల బదలాయింపునకు వీలుగా పరస్పర న్యాయ సహాయ ఒప్పందం, ఇతర అంశాలపై చర్చలను పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు.

బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్న మోడీ.. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా,స్కిల్ ఇండియా వంటి భారత దేశ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని బెల్జియం ప్రభుత్వానికి, కంపెనీలకు ఆహ్వానం పలికారు. బెల్జియం సామర్థ్యం, భారతకు ఉన్న వృద్ధి అవకాశాల కలయికతో అద్భుతమైన రీతిలో వ్యాపారానుకూలమైన పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చునన్నారు. దీని వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ ప్రారంభం

బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్‌తో కలిసి ఆసియాలో అతిపెద్ద ఆర్యభట్ట టెలిస్కోప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బెల్జియం సహాయంతో ఈ టెలిస్కోప్‌ను నిర్మించారు. ఉత్తరాఖండ్‌లోని నైనటాల్ సమీపంలో గల దేవస్థల్ వద్ద ఏర్పాటు చేసిన 3.6 మీటర్ల వెడల్పు కలిగిన అద్దంతో కూడిన ఈ టెలిస్కోప్‌ను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్. నక్షత్ర నిర్మాణాలు, వాటి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర వలయాలను అధ్యయనం చేయడానికి ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది.

ఐరాసపై ఆగ్రహం

ఉగ్రవాదాన్ని నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. బ్రెస్సెల్స్‌లో భారతీయ సంతతి ప్రజలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదంపై పోరు పట్ల ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు సరైన తీర్మానంతో ముందుకు రాలేదన్నారు. సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు సరైన రీతిలో స్పందించాలని, లేకుంటే ఆ పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

సమష్టి బలంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో బుధవారం సమావేశమైన ఆయన ఉగ్రవాదం ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే ఎదుర్కోవాలని ఉద్ఘాటించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇందులో భాగంగా నేరస్థుల పరస్పర మార్పిడి, ఖైదీల బదలాయింపునకు వీలుగా పరస్పర న్యాయ సహాయ ఒప్పందం, ఇతర అంశాలపై చర్చలను పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్న మోడీ.. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా,స్కిల్ ఇండియా వంటి భారత దేశ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని బెల్జియం ప్రభుత్వానికి, కంపెనీలకు ఆహ్వానం పలికారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

బెల్జియం సామర్థ్యం, భారతకు ఉన్న వృద్ధి అవకాశాల కలయికతో అద్భుతమైన రీతిలో వ్యాపారానుకూలమైన పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చునన్నారు. దీని వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌నే ఉత్పాదక కేంద్రంగా మార్చుకుని ఇరు దేశాలూ తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను చేయవచ్చునని, ఆ విధంగా అంతర్జాతీయ మార్కెట్‌పై పట్టునూ సంపాదించవచ్చునని తెలిపారు. ఒక్క వజ్రాలే కాదు ఇతర ఎన్నో వ్యాపారాలు ఇరు దేశాల భాగస్వామ్యానికి సరికొత్త నగిషీలు అందించే అవకాశం ఉందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారత్‌లో విస్తృతమైన ఆర్థిక అవకాశాలు ఉన్నాయని, ఏడు శాతానికి మించిన వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా దూసుకుపోతున్నామని తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత దేశ స్ఫూల ఆర్థిక మూల సూత్రాలు బలంగా ఉండటమే ఈ సుస్థిర అభివృద్ధికి కారణమని తెలిపారు. రాజకీయ, ఆర్థిక మార్పులను స్వయంగా పరిశీలించేందుకు భారత్‌కు రావాలని బెల్జియం ప్రధాన మంత్రిని మోడీ ఆహ్వానించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

రైల్వేలు, రేవు పట్టణాలను ఆధునీకరించడం, వందకు పైగా స్మార్ట్ సిటీలను నిర్మించడం వంటి వౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవాలన్న నిర్ణయాల వల్ల పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

బెల్జియం కంపెనీలు వ్యాపారానుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భాగస్వామ్యాల వల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యానికి ప్రతీకగా ‘రక్త'సంబంధం కూడా ఉందని తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దేళ్ల క్రితం అంటే తొలి ప్రపంచ యుద్ధంలో బెల్జియం తరపునే లక్షా 30వేల మంది భారత సైనికులు పోరాడారని, వారిలో 9వేల మంది మరణించారని మోడీ గుర్తు చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

వచ్చే ఏడాది భారత్-బెల్జియం దౌత్య సంబంధాలకు 70సంవత్సరాలు పూర్తవుతాయని, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ రావాలని కింగ్ ఫిలిప్పేను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఉగ్రవాదాన్ని నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమైందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. బ్రెస్సెల్స్‌లో భారతీయ సంతతి ప్రజలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఉగ్రవాదంపై పోరు పట్ల ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు సరైన తీర్మానంతో ముందుకు రాలేదన్నారు. సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు సరైన రీతిలో స్పందించాలని, లేకుంటే ఆ పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India has not bent before terrorism and will never do so, Prime Minister Narendra Modi said to an euphoric Indian community gathering here, while offering deepest condolences for the March 22 Brussels terror bombings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more