• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌లో చైనా కంపెనీలపై భారీ పిడుగు.. హైవే ప్రాజెక్టులకు నో.. 4జీ టెండర్లూ రద్దు.. మోదీ దూకుడు..

|

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాకవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. డేటా దొంగతనానికి పాల్పడిన కారణంగా టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్ లను నిషేధించిన గంటల వ్యవధిలోనే.. భారత్ బాటలో అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం చైనా దిగ్గజ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. తాజాగా మరో భారీ నిషేధానికి సంబంధించిన విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెళ్లడించారు. చైనా ఎంట్రీతో వివాదాస్పదంగా మారిన 4జీ నెట్ వర్క్ టెండర్లను కూడా కేంద్ర రద్దు చేసేసింది...

గాల్వాన్‌లో చైనాకు భారీ షాక్.. కృత్రిమ నిర్మాణాలపై ప్రకృతి ప్రకోపం.. చర్చల్లో అసాధారణ ప్రతిపాదన..

గడ్కరీ క్లారిటీ..

గడ్కరీ క్లారిటీ..

యాప్ లపై నిషేధం తర్వాత చైనా వ్యవహారాలపై కేంద్రం మరింత దూకుడు పెంచింది. భారత్ లో చేపట్టే హైవే ప్రాజెక్టుల్లో చైనా నిర్మాణ సంస్థలు పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మీడియాకు తెలిపారు. నేరుగా టెండర్లలో పాల్గొనబోనివ్వడమేకాదు, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా అనుమతించబోమని, టెక్నాలజీ పార్ట్‌నర్స్ గానూ వాటికి చాన్స్ ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగంలోనూ చైనా కంపెనీలను బ్యాన్ చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

టిక్ టాక్ కు మరో ఝలక్.. కోర్టుకెళ్లకముందే.. ఉద్యోగులకు సీఈవో కీలక సందేశం..

స్వదేశీ కంపెనీలకు సులభంగా..

స్వదేశీ కంపెనీలకు సులభంగా..

హైవే ప్రాజెక్టుల్లో చైనా నిర్మాణ సంస్థలపై నిషేధానికి సంబంధించిన విధివిధానాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని, ఈ మేరకు హైవే ప్రాజెక్టుల పాలసీలను కూడా సవరించబోతున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. భారీ ప్రాజెక్టుల టెండర్లలో చైనా కంపెనీలకు బదులుగా స్వదేశీ నిర్మాణ కంపెనీలను ప్రోత్సహించే దిశగా సాంకేతిక, ఆర్థిక పరమైన నిబంధనలను సవరిస్తామని, ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్నట్టైతే... రీబిడ్డింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశీ నిర్మాణ సంస్థలకు కల్పించే సడలింపులపై విధానాలు రూపొందించాల్సిందిగా జాతీయ రహదారుల సెక్రటరీ గిరిధర్, చైర్మన్ సంధూలకు సూచించినట్ల గడ్కరీ వివరించారు.

4జీ టెండర్లు రద్దు..

4జీ టెండర్లు రద్దు..

చైనా కంపెనీలు, చైనా ప్రాడక్ట్స్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంలో భాగంగా కేంద్ర సర్కార్.. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎంటీఎన్‌ఎల్‌)కి సంబంధించిన 4జీ అప్‌గ్రేడేషన్‌ టెండర్లను బుధవారం రద్దు చేసింది. అప్ గ్రేడేషన్ టెండర్లు మార్చిలోనే ఖరారు కాగా.. అందుకోసం వాడే పరికరాలు తక్కువ ధరకు చైనా నుంచి తీసుకొచ్చేందుకు బిడ్డర్లు సమాయత్తమయ్యారు. అయితే చైనా పరికరాల వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని, పైగా, నాణ్యత తక్కువనే ఉద్దేశంతో వాటిని వాడరాదని టెలికాం శాఖ నిర్ణయిచింది.

  TikTok బ్యాన్ ఎఫెక్ట్, Chingari Crosses 1Million Downloads On Play Store || Oneindia Telugu
  ‘ఆత్మ నిర్భర్‌’కు ఊతమిచ్చేలా..

  ‘ఆత్మ నిర్భర్‌’కు ఊతమిచ్చేలా..

  4జీ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియకు సంబందించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌(డీఓటీ) కొద్ది రోజుల కిందటే.. చైనా పరికరాలను ఉపయోగించవద్దని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను ఆదేశించడంతోపాటు సాధ్యమైనంత మేరకు చైనీస్ వస్తువుల్ని తగ్గించుకోవాలని ప్రైవేటు సంస్థలకూ సూచించింది. బుధవారం టెండర్ల రద్దు నిర్ణయంతోపాటు కొత్తగా రీ టెండరింగ్ ప్రక్రియ వివరాలను టెలికాం శాఖ వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భయ్ అభియాన్ లో భాగంగా పూర్తిగా స్వదేశీ పరికరాలనే వాడుకునేలా రీటెండరింగ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. అలాగే, 5జీ నెట్ వర్క్ విస్తరణకు సంబంధించి చైనీస్ దిగ్గజ సంస్థలైన హువావే, జడ్‌టీఈలతో నెరపుతోన్న చర్చలను కూడా రద్దు చేసుకోబోతున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది.

  English summary
  India will not allow Chinese companies to participate in highway projects, including those through joint ventures, Union Minister Nitin Gadkari said on Wednesday amid border standoff with China. center also cancelled BSNL, MTNL 4G tenders, new tender to emphasise on ‘make in India’.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X