వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌పై ప్రతీకారం తప్పదు, చేసిన తర్వాతే చెప్తాం: ఆర్మీ చీఫ్

పాకిస్తాన్ దుశ్చర్యలకు ప్రతీకారం తప్పదని, ఏం చేస్తామో ఇప్పుడే చెప్పబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం వెల్లడించారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న పాక్‌పై ప్రతీకార చర్యలు తీసుక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ దుశ్చర్యలకు ప్రతీకారం తప్పదని, ఏం చేస్తామో ఇప్పుడే చెప్పబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం వెల్లడించారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న పాక్‌పై ప్రతీకార చర్యలు తీసుకున్న తర్వాతే ఆ వివరాలను బహిర్గతం చేస్తామన్నారు.

జమ్ము కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భార‌త‌ జవాన్లను చంపేసి, అనంత‌రం వారి త‌ల‌లు న‌రికేసిన పాక్ రేంజ‌ర్ల చ‌ర్య‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతున్న విష‌యం తెలిసిందే.

ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆ తర్వాతే మాట్లాడుతాం

ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆ తర్వాతే మాట్లాడుతాం

ఈ నేప‌థ్యంలో ఆయన భారత సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు. అనతరం మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్‌ సైన్యంపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. ముందు ముందు ఏం చేస్తామో ఇప్పుడే మాట్లాడమన్నారు.

ఏం చేయాలో దృష్టి సారించాం

ఏం చేయాలో దృష్టి సారించాం

మ‌రోవైపు ఆర్మీ అధికారి శరత్ చాంద్ మాట్లాడుతూ.. భార‌త సైన్యం ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించింద‌న్నారు. భార‌త జ‌వాన్ల త‌లలు న‌రికిన విష‌యంలో పాక్‌ సైన్యం తాము ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేద‌న్న‌ట్లు మాట్లాడుతోంద‌న్నారు.

మరి పాక్ కాకుండా ఎవరు చేశారు

మరి పాక్ కాకుండా ఎవరు చేశారు

'తామేమి చేయలేదని పాక్‌ సైన్యం కల్లబొల్లి కబుర్లు చెప్తోంది. మరి ఇంకెవరు చేసినట్లు? పాక్‌ సైన్యం భారత భూభాగంలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి పాక్‌ తగిన శిక్ష ఎదుర్కొవాల్సి ఉంటుంద'ని శరత్ చాంద్ హెచ్చరించారు.

ధీటుగా స్పందిస్తుందని..

ధీటుగా స్పందిస్తుందని..

ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై స్పందించారు. ఇరువురు అమర జవాన్ల మరణం వృథా పోదని తేల్చి చెప్పారు. భారత సైన్యం ధీటుగా స్పందిస్తుందని చెప్పారు.

కాగా, పాకిస్తాన్ చర్యకు ఎలా స్పందించాలనే అంశంపై భారత సైన్యం వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది. సోమవారం బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రేమ్‌సాగర్‌, పరంజీత్‌ సింగ్‌ను పాక్‌ సైన్యం దారుణంగా హతమార్చి వారి తలలను మొండెం నుంచి వేరు చేసిన విషయం తెలిసిందే.

English summary
Talking tough, Army Chief General Bipin Rawat on Thursday said India will retaliate to enemy actions such as the one where two soldiers were beheaded by the Pakistan Army on the Line of Control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X