వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పాక్‌పై తొలి బుల్లెట్ భారత్ ఎప్పుడూ పేల్చలేదు’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దు వెంబడి ఉన్న భారత సైన్యం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మొట్టమొదటి బుల్లెట్ పాకిస్థాన్ సైన్యం కాల్చలేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భవిష్యత్‌లో కూడా అలా చేయబోమని అన్నారు.

పాకిస్థాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాతే భారత సైన్యం స్పందించిందన్నారు. ఢిల్లీలో సరిహద్దు విభాగానికి చెందిన డీజీ స్థాయి సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే.

మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశానికి హాజరైన రాజ్‌నాత్ సింగ్ మాట్లాడారు. పాక్ సైన్యం చర్యల పట్ల ఆయన సూటిగా బదిలిచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు ఉగ్రవాదుల విషయంలో కూడా స్పష్టమైన సూచనలు పాకిస్థాన్ సైన్యానికి ఇచ్చారు.

పాక్ భూభాగం నుంచి ఏ ఒక్క ఉగ్రవాది కూడా భారత భూభాగంలోకి చొరబడకుండా చూడాల్సిన బాధ్యత పాక్ సైనికులదేనని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పని చేస్తేనే శాంతి సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు.

India won't fire first bullet along border, Rajnath Singh tells Pak Rangers

కాల్పులు: ఇద్దరు సైనికుల మృతి, ఉగ్రవాదుల హతం

శ్రీనగర్: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని హంద్వారా సమీపంలో భారత్‌లోకి వచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.

అప్రమత్తమైన భారత జవాన్లు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు, సైనికుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

English summary
Union home minister Rajnath Singh on Friday told a delegate of Pakistan Rangers that "Indian forces will not fire the first bullet along the international border"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X