వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు మరింత ఉత్తేజం సేవలందించేందుకు సిద్ధమైన చినూక్ హెలికాప్టర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : భారత వాయుసేనలో బాహుబలి చేరింది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లలో ఒకటైన చినూక్ ఎయిర్ ఫోర్స్‌లో సేవలందించేందుకు సిద్ధమైంది. చండీగఢ్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో నాలుగు చినూక్ సీహెచ్ 47ఎఫ్ (ఐ) హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను వాయుసేనకు అప్పగించారు. అమెరికా ఫిలడెల్పియాలోని బోయింగ్ ఫ్యాక్టరీలో తయారుచేసిన విడిభాగాలను తీసుకొచ్చి భారత్ లో అసెంబుల్ చేశారు.

విమాన టికెట్లపై మోడీ ఫొటో దుమారం, వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన ఎయిరిండియావిమాన టికెట్లపై మోడీ ఫొటో దుమారం, వెనక్కి తీసుకుంటామని ప్రకటించిన ఎయిరిండియా

చినూక్‌తో చైనాకు చెక్

చినూక్‌తో చైనాకు చెక్

పక్కలో బల్లెంలా మారిన చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చినూక్‌లను ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చుకుంది. ఒకవైపు టిబెట్, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు పెరిగిపోవడంతో భారత్‌లో ఆందోళన పెరిగింది. దీనికి తోడు అత్యవసర పరిస్థితుల్లో బలగాలను సరిహద్దు ప్రాంతాలకు తరలించడం ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ 2015 - 16లో 15 చినూక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.

10 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం

10 టన్నులు మోసుకెళ్లే సామర్థ్యం

చినూక్ హెలికాప్టర్లు రెండు రొటేటర్ల విభిన్నంగా కనిపిస్తాయి. దాదాపు 10 టన్నులకుపైగా పేలోడ్ ను ఇది సునాయాసంగా తీసుకెళ్లగలదు. అంటే ఎం 777 శతఘ్నులు, భారీ మెషీన్లు ఒకచోట నుంచి మరో చోటకు తేలికగా తరలించగలదు. పర్వత ప్రాంతాలకు సైన్యాన్ని తరలించేందుకు చినూక్ ఉపయోగపడుతుంది. భారత సైన్యం ఎం 777 శతఘ్నులను చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్లాన్ చేసింది. చినూక్ రాకతో ఈ పని మరింత సులువుకానుంది. సహాయక కార్యక్రమాల్లోనూ చినూక్ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఎంఐ 26 కన్నామెరుగైన చినూక్

ఎంఐ 26 కన్నామెరుగైన చినూక్

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎంఐ 26 హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. హిమాలయ ప్రాంతాల్లో కూడా వీటిని వినియోగిస్తున్నారు. చినూక్ తో పోలిస్తే ఎంఐ 26 ఇంజన్లు చాలా పెద్దవి కావడం వాటిలో ప్రధాన లోపం. ఎంఐ 26 హెలికాప్టర్ బరువు 28 టన్నులు కావడంతో ఇంధనం ఖర్చు ఎక్కువే. చినూక్ బరువు కేవలం 10 టన్నులే కావడంతో ఇంధన వినియోగం భారీగా తగ్గుతుంది. ఎంఐ 26 హెలికాప్టర్ల స్పేర్ పార్టులకు తీవ్ర కొరత ఉన్నందున ఎయిర్‌ఫోర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ చినూక్‌లను ఎయిర్‌ఫోర్స్‌లో భాగం చేసింది.

English summary
The Indian Air Force has formally inducted Monday four US-made Chinook heavy-lift helicopters at Chandigarh's Air Force Station 12 Wing. The India specific CH- 47F (I) is a heavy lift, tandem rotor helicopter which currently serves the armed forces of 19 countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X