• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అభినందన్ సాహసాలపై వీడియో గేమ్: ఆవిష్కరించిన వాయుసేన!

|

న్యూఢిల్లీ: వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్. బహుశా ఈ పేరు తెలియని వారు మన దేశంలో గానీ, పక్కనే ఉన్న పాకిస్తాన్ లో గానీ దాదాపు ఉండకపోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దులను దాటుకుని.. మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ వైమానిక యుద్ధ విమానాన్ని తరిమి కొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు అభినందన్. ఆయన చేసిన సాహస విన్యాసాలతో కూడిన ఓ మొబైల్ వీడియో గేమ్ తాజాగా రూపుదిద్దుకుంది.

భారత వైమానిక దళం స్వయంగా ఈ వీడియో గేమ్ ను రూపొందించింది. బుధవారం దీన్ని ఆవిష్కరించింది. వైమానిక దళ ప్రధాన అధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఈ మొబైల్ గేమ్ ను న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్- ఎ కట్ అబౌ అని నామకరణం చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ ల మీద నడిచే స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వైసీపీ..ఘర్ వాపసీ షురూ: ఒకే దెబ్బకు రెండు పిట్టలు: ఆ కుటుంబం సొంత గూటికి

అభినందన్ చేసిన సాహసం ఏంటీ?

అభినందన్ చేసిన సాహసం ఏంటీ?

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనికి ప్రతీకారంగా మనదేశ వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. జమ్మూకాశ్మీర్ లో సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. బాలాకోట్ లో వెలసిన జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై నిప్పులు కురిపించింది. వాటిని నేలమట్టం చేసింది. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజులకే పాకిస్తాన్ వైమాని దళం కూాడా మనదేశ గగనతలంలోకి ప్రవేశించింది. మన ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసినప్పటికీ అవి గురి తప్పాయి. అనంతరం పాకిస్తాన్ కు చెందిన వైమానిక దళ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ మిగ్-21 బైసన్ లో వెళ్లిన అభినందన.. దురదృష్టవశావత్తూ పాక్ గడ్డపై దిగిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో ఆయన పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కారు. శతృదేశానికి యుద్ధ ఖైదీగా దొరికినప్పటికీ.. అభినందన్ ఏ ఒక్క రహస్యాన్ని వెల్లడించడానికి సిద్ధపడలేదు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్తాన్.. మూడు రోజుల వ్యవధిలోనే ఆయనను స్వదేశానికి అప్పగించింది.

వీడియో గేమ్ లో ఏమేమి ఉన్నాయి?

వీడియో గేమ్ లో ఏమేమి ఉన్నాయి?

ఈ సందర్భంగా అభినందన్ చేసిన సాహసాలన్నింటినీ ఆధారంగా చేసుకుని వైమానిక దళ అధికారులు ఈ వీడియో గేమ్ ను రూపొందించారు. సుఖోయ్, మిగ్-1 హెలికాప్టర్లు, గాల్లోనే ఇంధనాన్ని నింపే యుద్ధ విమానాలు ఈ వీడియోలో మనకు కనిపిస్తాయి. హాక్ 132 జెట్ యుద్ధ విమానం నమూనాను కూడా ఇందులో ఉంది. గంటకు 830 కిలోమీటర్ల వేగంతో మనం ఈ విమానాన్ని నడిపించవచ్చు. మనం కూడా శతృదేశ విమానాన్ని తరిమి కొట్టవచ్చు. ఎయిర్ బెలూన్ సహకారంతో పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టవచ్చు కూడా.

సింగిల్ ప్లేయర్ లో..

ప్రస్తుతానికి ఈ వీడియో గేమ్ సింగిల్ ప్లేయర్ మోడ్ లో అందుబాటులో ఉంది. ఒక్కరే దీన్ని ఆడవచ్చు. త్వరలోనే దీన్ని మరింత అభివృద్ధి డబల్ ప్లేయర్ అంటే ఇద్దరు కలిసి ఆడేలా రూపొందిస్తామని వైమానిక దళ అధికారులు తెలిపారు. అభినందన్ చేసిన సాహసాలు కళ్లకు కట్టినట్టుగా చూపాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారు చేశామని అన్నారు. యువతను త్రివిధ దళాల్లో చేరేలా ప్రేరేపించడానికి ఇలాంటి గేమ్ లు ఉపయోగపడతాయని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The IAF mobile game has been launched. The game is called "Indian Air Force: A Cut Above" and is now available to download on Android and iOS platform right now. The game has been launched in a bid to make the youth aware of the Indian Air Force and encourage them to join the forces. The game was launched by Chief of Air Staff, Air Chief Marshal BS Dhanoa and is based on air combat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more