వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఎయిర్‌ఫోర్స్ కంటే భారత ఎయిర్ ఫోర్స్ బలహీనమైనదా..?

|
Google Oneindia TeluguNews

ఫిబ్రవరిలో భారత వాయుసేన బాలాకోట్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ భారత్ దేశాల రక్షణ వ్యవస్థతో పోలిస్తే భారత వాయుసేన పాకిస్తాన్ వాయుసేన కంటే ధీటుగా లేదనే వాదన వినిపిస్తోంది. అది పైలట్ల నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వరకు, బలమైన స్క్వాడ్రాన్‌ కూడా భారత్‌కు లేకపోవడం భద్రతపై కాస్త కలవరపెడుతోంది.

ఒక్క ఎయిర్ క్రాఫ్ట్‌కు 1.5 నిష్పత్తితో పైలట్లు

ఒక్క ఎయిర్ క్రాఫ్ట్‌కు 1.5 నిష్పత్తితో పైలట్లు

గ్రౌండ్ రియాల్టీ చూస్తే భారత వాయుసేనలో పైలట్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్ నిష్పత్తి పరిశీలిస్తే ఒక్క ఎయిర్ క్రాఫ్ట్‌కు 1.5 నిష్పత్తితో పైలట్లుఉన్నారు. అదే పాకిస్తాన్‌ వాయుసేనలో ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌కు 2.5 నిష్పత్తితో పైలట్లు ఉన్నారని రక్షణశాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూస్తే పాకిస్తాన్ వాయుసేన భారత వాయుసేన కంటే ఆపరేషన్లు మరింత చురుగ్గా చేయగలదనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఎయిర్ క్రాఫ్ట్‌లు ఆరు రోజుల పని ఒకరోజులోనే చేయగలవు కానీ మానవులైన పైలట్లతో ఇది సాధ్యం కాదు. బాంబులు నేరుగా విసరడం కన్నా భారత వాయుసేన ప్రోగ్రామింగ్ మీదే ఎక్కువగా ఆధారపడుతోందని సమాచారం. ఇక పశ్చిమ భారతంలో ఉన్న ఎయిర్ కమాండ్ పాకిస్తాన్ గగనతలం పై నిత్యం నిఘా ఉంచడమే కాదు.. కొంత చైనా గగనతలంను కూడా పర్యవేక్షిస్తుంది. అయితే అధిక సామర్థ్యం ఉన్న బాంబులను విసిరేంత కెపాసిటీ ఈ ఎయిర్ కమాండ్ దగ్గర లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 42 స్క్వాడ్రన్‌లు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 42 స్క్వాడ్రన్‌లు

ఇక భారత వాయుసేనకు వైమానిక బృందం లీడర్లు శాంక్షన్ చేసింది. మొత్తం 42 స్క్వాడ్రన్‌లను ఇచ్చింది. అంటే మొత్తం 12500 మంది ఈ బృందాల్లో ఉంటారు. ఒక్కో స్క్వాడ్రన్‌కు 16 నుంచి 20 యుద్ధవిమానాలను కేటాయిస్తారు. ఈ బృందాల్లో పైలట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మిగ్ యుద్ధ విమానాలు వినియోగించే సమయంలో పైలట్ల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఎస్‌యూ 30 ఎంకేఐ యుద్ధ విమానాలు 270 వరకు భారత అమ్ములపొదిలో ఉన్నట్లు సమాచారం.

 బాంబు దాడులకు కంప్యూటర్ సిమిలేషన్ పై ఆధారపడుతున్న ఐఏఎఫ్

బాంబు దాడులకు కంప్యూటర్ సిమిలేషన్ పై ఆధారపడుతున్న ఐఏఎఫ్

ప్రస్తుతం బాంబు దాడులు చేయాలంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పైలట్లు ఆధారపడుతున్నారు. అయితే ఇది కచ్చితంగా నష్టం చేకూరుస్తుందని... నేరుగా విమానం నుంచే లక్ష్యం దిశగా బాంబు దాడి చేసే వ్యవస్థపై పైలట్లకు ట్రైనింగ్ ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ప్రాక్టీస్ చేసేందుకు అధిక ఎత్తు ఉన్న ప్రాంతాలు ఉంటే బాగుంటుందని భావించిన ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే జమ్మూ కశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కొంత స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే 2015 నుంచి అనుమతి పెండింగ్‌లోనే ఉంది. ఇవన్నీ త్వరగా గ్రహించుకుని సరిదిద్దుకోకపోతే శతృదేశం నుంచి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

English summary
The Indian Air Force (IAF) may have successfully conducted a daring air raid against terrorist camps in Pakistan’s Balakot in February, but when it comes to a key metric, the IAF doesn’t compare well with the Pakistan AirForce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X